Indian 2 Movie Dispute: పోలీస్ స్టేషన్ మెట్టెక్కకుండా..కోర్టు కచేరీల్లేకుండా పరస్పరం రాజీ కుదుర్చుకుని వివాదాల్ని పరిష్కరించుకోవడం తెలిసిందే మనకు. సాక్షాత్తూ మద్రాస్ హైకోర్టు ఇప్పుడు అలా చేయమంటోంది. ఆశ్చర్యంగా ఉందా..నిజమే మరి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివాదాన్ని పరిష్కరించాల్సిన కోర్టు..సమస్యకు సమాధానం చెప్పాల్సిన న్యాయస్థానమే పంచాయితీ చేసుకోమని చెబుతోంది. విడ్డూరంగా ఉన్నా సరే నిజమే ఇది. సాక్షాత్తూ మద్రాస్ హైకోర్టు (Madras High Court) చేసిన వ్యాఖ్యలివి. ఇండియన్ 2 సినిమా( Indian 2 movie) వివాదానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లైకా ప్రొడక్షన్స్ ఆధ్వర్యాన రూపొందుతున్న ఇండియన్ 2 ప్రాజెక్టును మధ్యలో ఆపేసి మరో సినిమా ప్రారంభించడంతో ప్రముఖ దర్శక నిర్మాత శంకర్ ‌(Shankar )పై నిర్మాణ సంస్థ కేసు వేసింది.ఈ కేసు విచారణను మద్రాస్ హైకోర్టు చేపట్టింది. 


గత ఏడాది అంటే 2020 మార్చ్ నాటికి ఇండియన్ 2 (Indian 2) షూటింగ్ పూర్తి చేస్తామని శంకర్ హామీ ఇచ్చారని..ఆలస్యం చేయడంతో భారీగా నష్టపోయామని హైకోర్టుకు విన్నవించింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. ఇతర సినిమాలు చేపట్టకుండా శంకర్‌పై ఆంక్షలు విధించాలని హైకోర్టును కోరింది.హాస్య నటుడు వివేక్ ( Comedian Vivek) మరణించడంతో సీన్స్ అన్నీ మళ్లీ తీయాలని శంకర్ వివరించారు. ఇరు పక్షాల వాదనల్ని విన్న మద్రాస్ హైకోర్టు..ఈ సమస్యకు పరిష్కారం తమ వద్ద రాదని..ఇరు పక్షాలు కూర్చుని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. విచారణను ఏప్రిల్ 28కు వాయిదా వేసింది. కోర్టు జోక్యంతో వివాదంలో సానుకూలత ఏర్పడదని వ్యాఖ్యానించింది.


1996లో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్ 2 తెరకెక్కనుంది. సినిమా షూటింగ్‌లో ప్రమాదం, కమల్ హాసన్(Kamal Haasan) నిన్నటి వరకూ ఎన్నికల్లో బిజీ కావడంతో దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాకు ఇప్పుడు బ్రేక్ పడింది.


Also read: Wild Dog Movie: ఓటీటీ వేదికగా Akkineni Nagarjuna లేటేస్ట్ మూవీ వైల్డ్ డాగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook