Mark Antony Release date: తమిళ్ స్టార్ హీరో విశాల్ నయా మూవీ 'మార్క్ ఆంటోని'(Mark Antony). ఇందులో ఎస్జే సూర్య, రీతూవర్మ, అభినయ, సునీల్, సెల్వ రాఘవన్ తదితరులు కీ రోల్స్ చేశారు. ఈ మూవీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 15న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో విశాల్, లైకా నిర్మాణ సంస్థ మధ్య ఏర్పడిన వివాదం తెరపైకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏంటి వివాదం?
తమతో సినిమా తీస్తానని చెప్పి తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని .. ఆ డబ్బు తిరిగి చెల్లించలేదంటూ గత ఏడాది లైకా ప్రొడక్షన్స్ హైకోర్టులో కేసు వేసింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు లైకా సంస్థకు విశాల్ రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని పేర్కొంది. అంతేకాకుండా ఆస్తులు వివరాలు కూడా సమర్పించాలని విశాల్ ను కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు విశాల్ నటించిన సినిమాలు ఇటు థియేటర్లలోగానీ, అటు ఓటీటీల్లో గానీ రిలీజ్ చేయకూడదని కోర్టు స్టే విధించింది. 


Also Read: Rules Ranjann: మళ్ళీ వాయిదా పడిన 'రూల్స్ రంజన్'.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?


అయితే అదే సమయంలో విశాల్ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తన సినిమాలను విడుదల చేస్తున్నారని లైకా సంస్థ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఇదే కేసు సెప్టెంబరు 08న విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా లైక్ సంస్థ తమకు విశాల్ రూ.15 కోట్లు చెల్లించలేదని కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో విశాల్ లేటేస్ట్ మూవీ మార్క్ ఆంటొని విడుదలపై కోర్టు నిషేధం విధించింది. అంతేకాకుండా విశాల్ సెప్టెంబరు 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని పేర్కొంది. ఈ క్రమంలో ఈరోజు విశాల్ స్వయంగా కోర్టుకు హాజరై ప్రాబ్లమ్ ను క్లియర్ చేశారు. దీంతో మార్క్ ఆంటోని రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయనున్నారు. 


Also Read: Mammootty: మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం... తల్లి మృతి చెందిన బాధ నుంచి తేరుకోకముందే ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook