Rules Ranjann: మళ్ళీ వాయిదా పడిన 'రూల్స్ రంజన్'.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Rules Ranjann: కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం రూల్స్‌ రంజన్. ఈ మూవీ రిలీజ్ డేట్ ను మరోసారి వాయిదా వేశారు మేకర్స్. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుందంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2023, 04:17 PM IST
Rules Ranjann: మళ్ళీ వాయిదా పడిన 'రూల్స్ రంజన్'.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Rules Ranjann new Release date: టాలీవుడ్ యంగ్ హీరో  కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) నయా మూవీ రూల్స్‌ రంజన్ (Rules Ranjann)‌. రుథిరమ్‌ కృష్ణ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌, సాంగ్స్‌, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేయాలని మెుదట మేకర్స్ భావించారు. కానీ ఎందుకో మళ్లీ వాయిదా వేశారు మేకర్స్. తాజాగా కొత్త డేట్ ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 06న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరోహీరోయిన్లు రొమాంటిక్ లుక్‌ లో కనిపించారు. 

ఈ చిత్రంలో మెహర్ చాహల్‌, వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, మకరంద్‌ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్‌, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్దార్థ్ సేన్, అన్నూ కపూర్‌, అజయ్‌, అతుల్ పర్చురే, విజయ్‌ పాట్కర్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. రూల్స్‌ రంజన్‌ చిత్రానికి అమ్రిష్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సమ్మోహనుడా సాంగ్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రయూనిట్ త్వరలోనే ప్రమోషన్స్ షురూ చేయనుంది. మరి ఈసారైనా రూల్స్ రంజన్ చెప్పిన డేట్ కి వస్తాడా లేక వాయిదా వేస్తాడో అనేది వేచి చూడాలి. 

Also Read: Mammootty: మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం... తల్లి మృతి చెందిన బాధ నుంచి తేరుకోకముందే ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News