Nayanthara row: నయనతారకు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు.. ఎందుకంటే..?
Nayanthara VS Dhanush: మద్రాస్ హైకోర్టు నటి నయన తారకు తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది. కొన్నిరోజులుగా నయనతార వర్సెస్ ధనుష్ వివాదం రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటన కీలక పరిణామం చెప్పుకొవచ్చు.
Madras High court issues notice to nayanthara: నయన తార వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని తెలుస్తొంది. కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో నయన తార కాంట్రవర్సీ అంశంతో ఎక్కువగా వార్తలలో ఉంటున్నట్లు తెలుస్తొంది. నయన్ తార గతంలో పెళ్లి జరిగినప్పుడు.. తిరుమలకు చెప్పులువేసుకుని తిరుమల మాడవీధుల్లో తిరిగారని తెలుస్తొంది. అంతే కాకుండా.. స్వామి వారి ఆలయ ఆవరణలో.. ఫోటో షూట్ కూడా వివాదంగా మారింది.
ఈ క్రమంలో విఘ్నేష్ శివన్ తో పెళ్లి తర్వాత కూడా ఏదో ఒక అంశంతో నయన్.. తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల మాత్రం నయన తార వ్యవహారం పీక్స్ కు వెళ్లిందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా నయన తార.. జీవిత చరిత్ర ఆధారంగా నయన తార బియాండ్ దిఫెయిరీటెల్ అనే డాక్యుమెంటరీ ను తీసినట్లు తెలుస్తొంది. అయితే.. దీనికి నిర్మాతగా ధనుష్ ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల నయన్ విఘ్నేష్ శివన్ దంపతులు.. దీనిలోని కొన్నిసీన్స్ తమ డాక్యుమెంటరీ.. నానుమ్ రౌడీ దాన్ కోసం ఉపయోగించుకుంటామని ధనుష్ ను పలు మార్లు కోరినట్లు తెలుస్తొంది. కానీ ఆయన స్పందించలేదని నయన్ వాదిస్తుంది. ఆయన ఎన్ వోసీ ఇవ్వలేదని సమాచారం. కానీ నయన్ మాత్రం.. తాజాగా. మూడు సెకన్ల నిడివిని నానుమ్ రౌడీ దాన్ లో ఉపయోగించుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో.. దీనిపై రచ్చ నెలకొంది.
తన పర్మిషన్ లేకుండా మూడు సెకన్ల క్లిప్ వాడుకున్నందుకు ధనుష్.. పది కోట్లు ఇవ్వాలని లీగల్ నోటీసులు పంపించారు. దీంతో వీరి మధ్య రచ్చ మొదలైంది. దీనిలో నయన్ తార.. ధనుష్ నిజస్వరూపం ఇదని కూడా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి ధనుష్ ను ఏకీపారేసింది.
మరొవైపు ధనుష్ ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా... ఈ పిటిషన్ పైవిచారణచేపట్టిన హైకోర్టు.. జనవతి 8 లోగా వివరణ ఇవ్వాలని కూడా నయన తారకు..నెట్ ఫ్లిక్స్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం నయన తార రచ్చ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.