Mahesh Babu's Pokiri Movie re release 2022 collections shakes box office: టాలీవుడ్ 'సూపర్‌ స్టార్‌' మహేశ్‌ బాబు, మాస్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ సినిమా 'పోకిరి'. 2006లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టింది. అప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్ని కనుమరుగయిపోయాయి. మహేశ్‌ బాబు, పూరి జగన్నాథ్‌ కూడా పోకిరి చిత్రం అంత పెద్ద హిట్ అవుతుందని అనుకొని ఉండరు. పోకిరి సినిమా మహేశ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మురారి, ఒక్కడు సినిమాలతో సత్తాచాటిన మహేష్.. పోకిరి చిత్రంతో ఆల్ టైమ్ సూపర్ హిట్ అందుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగస్టు 9న మహేశ్ బాబు బర్త్ డే. ఆ రోజున సోషల్ మీడియాలో ఎంత బీభత్సం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాబు బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ గత హిట్ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించారు. అందులో పోకిరి సినిమా కూడా ఉంది. పోకిరి మూవీని రి-రిలీజ్ చేసినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద సత్తాచాటింది. మరోసారి కలెక్షన్ల సునామి సృష్టించింది. అందరూ ఊహించినట్లుగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ ఫాన్స్ భారీ సంఖ్యలో పోకిరి స్పెసల్ షోలకు హాజరయ్యారు. దాంతో ఆగస్ట్ 9న రీ-రిలీజ్ అయిన పోకిరి సినిమా అన్ని చోట్లా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 


పోకిరి సినిమా స్పెషల్ షోలు ప్రపంచ వ్యాప్తంగా 1.73 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేశాయి. నైజాంలో రూ. 69 లక్షలు, గుంటూరులో రూ. 13 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 4లక్షలు వసూల్ అయ్యాయి. టాలీవుడ్‌లో రీ-రిలీజ్ అయిన ఏ సినిమాకు ఇంత కలెక్షన్ రాకపోవడం విశేషం. భారతీయ సినిమా చరిత్రలో కూడా ఇది ఎన్నడూ లేని రికార్డు అని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ఇలియానా అందచందాలు, మణిశర్మ బాణీలు కూడా బాగా ప్లస్ అయ్యాయి. 



పోకిరి రి రిలీజ్ కలెక్షన్స్: 
నైజాం - 69,07,433
ఉత్తరాంధ్ర - 24,89,638
గుంటూరు - 13,02,265
తూర్పు గోదావరి - 11,78,820
సీడెడ్ - 13,36,902
కృష్ణ - 10,25,251
వెస్ట్ గోదావరి - 5,39,694
నెల్లూరు - 4,41,752
రెస్ట్ ఆఫ్ ఇండియా - 4,01,875
ఓవర్సిస్ - 17,03,611
మొత్తం - 1,73,27,241


Also Read: రూ. 275తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.. రెండున్నర నెలల పాటు సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్!


Also Read: ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ వద్దు.. రోహిత్‌ శర్మకు అతడే సరైన జోడి: కనేరియా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook