Mahesh Babu Bollywood Entry with  SS Rajamouli: ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ మీడియాలో కలకలం రేపాయి. ఆయన నిర్మాతగా నిర్మించిన అడవి శేష్ మేజర్ సినిమాని హిందీలో ప్రమోట్ చేస్తున్న సమయంలో మీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అని అడిగితే మహేష్ బాబు దానికి ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. చెబితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ నిజానికి బాలీవుడ్ నుంచి నాకు చాలా సినిమా అసలు వస్తున్నాయి కానీ నన్ను బాలీవుడ్ భరించలేదు అంటే రెమ్యూనరేషన్ పరంగా తనను తట్టుకోలేదు అంటూ కామెంట్లు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. అయితే మహేష్ బాబు అప్పట్లో ఆ మాటలు అన్నా సరే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి అంతా సిద్ధమైందనే ప్రచారం బాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారు.


ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో అంటే బాలీవుడ్లో సైతం విడుదల చేయబోతున్నారు. అలా మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ జరగబోతోంది అన్నమాట. మహేష్ బాబు వద్దు అనుకున్నా సరే రాజమౌళికి ఉన్న మార్కెట్ దృష్ట్యా నిర్మాతలు కచ్చితంగా ఆ సినిమాను బాలీవుడ్ లో కూడా విడుదల చేస్తారు. నన్ను బాలీవుడ్  భరించలేదు అని  కామెంట్ చేసిన మహేష్ బాబు ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి సిద్దం అయ్యారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఆయన నేరుగా బాలీవుడ్ సినిమా చేయనన్నారు కానీ ఇప్పుడు ఇది తెలుగు సినిమానే డబ్బింగ్ చేసి మిగతా భాషలలో విడుదల చేస్తున్నారు కాబట్టి బాలీవుడ్ ఎంట్రీ కాదు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


Also Read: Balakrishna: బాధలో ఉన్న బాలకృష్ణని సెల్ఫీ అడిగాడు.. రియాక్షన్ చూశారా?


Also Read: SitaRamam: తెలుగులో హీరోలు లేరా.. దుల్కర్‌పై సంతోష్ శోభన్ షాకింగ్ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook