Balakrishna: బాధలో ఉన్న బాలకృష్ణని సెల్ఫీ అడిగాడు.. రియాక్షన్ చూశారా?

Fan asks Balakrishna Selfie at Umamaheswari Final rites: సోదరి మరణంతో బాధలో ఉన్న బాలకృష్ణను అంత్యక్రియల వద్దే సెల్ఫీ అడిగాడు ఒక అభిమాని. సాధారణంగా అయితే చేయి చేసుకునే బాలయ్య ఈ సారి చేసిన పని ఆశ్చర్యం కలిగిస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 3, 2022, 03:49 PM IST
Balakrishna: బాధలో ఉన్న బాలకృష్ణని సెల్ఫీ అడిగాడు.. రియాక్షన్ చూశారా?

Fan asks Balakrishna Selfie at Umamaheswari Final rites: ఈ మధ్య కొంతమంది వ్యక్తులు ఏ సందర్భం అయినా సరే సెల్ఫీలు తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. కొన్నేళ్ల క్రితం సెల్ఫీ ట్రెండు కొత్తగా మొదలైన రోజుల్లో ఒక వ్యక్తి శవం దగ్గర తీసుకున్న సెల్ఫీ ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ తర్వాత ఈ సెల్ఫీ పిచ్చి ఎంతలా ముదిరిపోయిందంటే వరదలు వస్తుంటే వరదలతో సెల్ఫీలు తీసుకునే వరకు వెళ్ళింది. అలా సెల్ఫీలు తీసుకుంటూ అనేకమంది మృత్యువాత పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక అభిమాని సెల్ఫీ కోసం చేసిన పని బాలకృష్ణకు ఏహ్యభావం కల్గించింది.

అసలు విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ సోదరి కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు బుధవారం నాడు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. ఇక ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ సహా నందమూరి కుటుంబ సభ్యులు, నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

ఇక ఈ అంత్యక్రియలకు హాజరైన తర్వాత వెనుతిరుగుతున్న క్రమంలో నందమూరి బాలకృష్ణను ఒక అభిమాని సెల్ఫీ అడిగిన ఘటన సంచలనంగా మారింది. సాధారణంగా అయితే బాలకృష్ణ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు సెల్ఫీ అడిగిన వారి మీద చేయి చేసుకున్న సంఘటనలు ఎన్నో చూశాం. ఒక్కో సందర్భంలో ఆయన ఫోన్లు కూడా పగలగొట్టారు. కానీ పేగుపంచుకు పుట్టిన సోదరి ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయన దగ్గరకు వెళ్లి సెల్ఫీ అడగడంతో ఏమనాలో అర్థం కాక ఏహ్యభావంతో ఒక చూపు చూసి వెళ్ళిపోయారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎంతటి హీరో అయినా ఆయనకు కూడా మనసు ఉంటుందని సోదరి మరణంతో కృంగిపోతున్న ఆయన ఎంతో బాధను దిగమింగుకొని అంత్యక్రియలకు హాజరైతే ఇలా వెళ్లి సెల్ఫీలు అడగడం ఎంతవరకు సమంజసం అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

Read Also:  SitaRamam: తెలుగులో హీరోలు లేరా.. దుల్కర్‌పై సంతోష్ శోభన్ షాకింగ్ కామెంట్స్

Read Also: Naga Chaitanya: నాగ చైతన్య, సమంత కలిసి నటించబోతున్నారా..చైతూ ఏమన్నాడంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News