Jayakrishna As Hero: కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. లాంచింగ్ బాధ్యతలు తీసుకున్న మహేష్ బాబు!
Ramesh Babu son Jayakrishna to be launched as hero: కృష్ణ పెద్ద కుమారుడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ సినీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు
Mahesh Babu Brother Ramesh Babu son Jayakrishna to be launched as hero: సూపర్ స్టార్ కృష్ణ కొద్దిరోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిజానికి కృష్ణ కుటుంబం నుంచి ముందుగా హీరోగా ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు. కృష్ణా ఇంద్రాదేవి దంపతుల మొదటి కుమారుడైన రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నటన కలిసి రాకపోవడంతో నటన నుంచి నిర్మాణరంగం వైపు మళ్లారు. నిర్మాతగా కూడా పలు ప్రాజెక్టులు చేసి ఎందుకు సైలెంట్ అయ్యారు. అయితే కృష్ణ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మాత్రం హీరోగా సత్తా చాటారు.[[{"fid":"252905","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
అనేక సినిమాలతో తండ్రికి తగ్గ వారసుడిగా నిలిచారాయన. ప్రస్తుతానికి కృష్ణ లెగసీని మహేష్ బాబు ముందుకు తీసుకు వెళుతున్నారు. అయితే వీరి కుటుంబం నుంచి మంజుల నటిగా ఎంట్రీ ఇచ్చింది. బాలకృష్ణతో ఒక సినిమా చేస్తుందని అనుకున్నారు కానీ అభిమానుల ఆగ్రహానికి భయపడి వెనకడుగు వేసింది. అయితే ఆ సంగతి అలా ఉంచితే తర్వాత వీరి కుటుంబం నుంచి కృష్ణ కుమార్తె పద్మావతి - గల్లా జయదేవ్ కుమారుడైన గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు సంపాదించే ప్రయత్నం చేశాడు.[[{"fid":"252906","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
కృష్ణ బతికి ఉండగానే ఆయన హీరో అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించారు. అలాగే కృష్ణ కుమార్తె ప్రియదర్శిని వివాహం చేసుకున్న సుధీర్ బాబు కూడా సినిమాల మీద ఆసక్తితో సినీ ఎంట్రీ ఇచ్చారు. కృష్ణ ఆయన కెరీర్ ని కూడా చూసి ఆనంద పడుతూ ఉండేవారు. ఇక ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విషయం కృష్ణ చిన్న కర్మ రోజున బయిటకు వచ్చింది. అదేమిటంటే రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ సినీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.[[{"fid":"252907","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
కృష్ణ ప్రోత్సాహం మేరకు ఆయన అమెరికా వెళ్లి నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు.కృష్ణ మరణానంతరం ఆయన్ని కడసారి చూసుకునేందుకు కూడా జయకృష్ణ రాలేకపోయాడు. అమెరికా నుంచి ప్రయాణం దూరం కావడంతో కాస్త లేట్ అయింది. తాజాగా హైదరాబాద్ చేరిన అతనితో మహేష్ బాబు కొన్ని ఫోటోలు దిగారు అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.[[{"fid":"252908","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
జయకృష్ణను మహేష్ బాబు స్వయంగా లాంచ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కృష్ణ ఉంటే ఆయనే అవన్నీ చూసుకునేవారు కానీ కృష్ణ లేకపోవడంతో తన అన్న రమేష్ బాబు కుటుంబ బాధ్యతలు కూడా మహేష్ బాబు చూసుకుంటారని అంటున్నారు. మొత్తం మీద ఆ ఫోటోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అవి మీరు కూడా చూసేయండి మరి.[[{"fid":"252909","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
Also Read: Puri Jagannath: పూరీ వెంట ఈడీ పడుతోంది అందుకేనా? అరెస్ట్ తప్పదా?
Also Read: Mythri Movie Makers: బాలయ్య vs చిరు, మధ్యలో దిల్ రాజు.. ఆయన తప్పుకున్నా తప్పవు తిప్పలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook