Mythri Movie Makers: బాలయ్య vs చిరు, మధ్యలో దిల్ రాజు.. ఆయన తప్పుకున్నా తప్పవు తిప్పలు!

Waltair Veerayya Vs Veera Simhareddy Tension: వాల్తేరు వీరయ్య vs వీరసింహా రెడ్డి మధ్యలో దిల్ రాజు అన్నట్టు తయారైంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పరిస్థితి. ఆ వివరాల్లోకి వెళితే 

Last Updated : Nov 18, 2022, 04:57 PM IST
Mythri Movie Makers: బాలయ్య vs చిరు, మధ్యలో దిల్ రాజు.. ఆయన తప్పుకున్నా తప్పవు తిప్పలు!

Waltair Veerayya Vs Veera Simhareddy Tension for Mythri Movie Makers: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలయ్యేందుకు రంగం సిద్ధమైంది. వాస్తవానికి ఈ రెండు సినిమాలు ఒకేసారి సంక్రాంతి పండుగకు రిలీజ్ కావడం అసాధ్యమని అందరూ భావించారు. ఎందుకంటే ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తమ రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయదు అని అందరూ భావించారు. కానీ వాస్తవానికి నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా ముందే విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ వాయిదా పడుతూ కాస్త ఆలస్యమైన నేపద్యంలో సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ చిరంజీవి సినిమా విషయంలో మాత్రం యూనిట్ ముందు నుంచి క్లారిటీతోనే ఉన్నారు.

ఆ సినిమాను కచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారు. ఇప్పుడు ఇద్దరు హీరోలు తమ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని భీష్మించుకుని కూర్చున్న నేపథ్యంలో ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా భావిస్తుంది. ఇదే ఇప్పుడు ఆ సంస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే సరిగ్గా అదే సమయానికి దిల్ రాజు ఈ రెండు సినిమాల హక్కులు డిస్ట్రిబ్యూట్ చేసేందుకు తనకు ఇవ్వమని కోరాడు. అయితే ఏమనుకున్నారో ఏమో కానీ డిస్ట్రిబ్యూషన్ ఈసారి ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పి పంపేశారు. ఆ వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు గాను మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కూడా ప్రారంభించింది. ఈ విషయాన్ని అవమానంగా ఫీలైన దిల్ రాజు తాను నిర్మాతగా రూపొందిస్తున్న వారసుడు సినిమాని ఈ రెండు సినిమాలకు పోటీగా రంగంలోకి దించుతున్నాడు.

ఈ సినిమా డైరెక్ట్ సినిమా కాదు, తమిళంలో రూపొందుతుండగా విజయ్ క్రేజ్, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లను తెలుగు వారికి కూడా ఇష్టమే కావడంతో డబ్బింగ్ చేయిస్తున్నారు. వాస్తవానికి గతంలో దిల్ రాజు ఇలా డబ్బింగ్ సినిమాల విషయంలో థియేటర్లు దొరకవు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు తన సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం రెండు డైరెక్ట్ సినిమాల కంటే ఎక్కువగా ధియేటర్లు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో దాదాపుగా సఫలం అవుతున్నాడు కూడా. ఈ విషయం మీద తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇప్పటికే స్పందిస్తూ ఇలా చేయడం కరెక్ట్ కాదని దిల్ రాజు గతంలో చెప్పిన ప్రకారమే ఎగ్జిబిటర్లు ప్రథమ ప్రాధాన్యత తెలుగు సినిమాలకు ఇవ్వాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయినా దిల్ రాజు మాత్రం తన పంధాలో తాను ఉన్నాడు. తన సినిమాకి ఎక్కువ థియేటర్లు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఒకవేళ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ విషయాన్ని బాలకృష్ణ, చిరంజీవి దృష్టికి తీసుకువస్తే వాళ్ళు దిల్ రాజుని వారించకపోవచ్చు. ఒకవేళ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడి దిల్ ర్రాజుతో ఆయన సినిమా వాయిదా పడేలాగా చేసినా ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా ముందు వస్తుందా లేక వీర సింహారెడ్డి ముందు వస్తుందా అనే విషయం మీద కూడా వాదోపవాదాలు జరుగుతాయి. ముందుగా ఏ సినిమా వచ్చినా దాదాపుగా సింహభాగం స్క్రీన్లు ఆ సినిమాకి దక్కుతాయి. కలెక్షన్స్ విషయంలో రికార్డులు సృష్టిస్తాయి. ఒక్కరోజే ఆ థియేటర్లో సినిమా ఆడినా సరే రికార్డుల పరంగా ,కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనకడుగు వేయదు. తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాకి ఈ స్క్రీన్స్ విషయంలో కాస్త ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది.

మొదటి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే దాన్ని తీసి రెండో సినిమా వేసేందుకు ధియేటర్ల యాజమాన్యం అంత ఆసక్తి చూపించరు. ఆ దీంతో ఎఫెక్ట్ కచ్చితంగా రెండవ సినిమా మీద పడుతుంది. అందుకే ఒకవేళ ముందు బాలకృష్ణ సినిమా ముందు రిలీజ్ చేస్తే చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంది, లేదు చిరంజీవి సినిమా ముందు రిలీజ్ చేస్తే బాలకృష్ణ అభిమానులు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎలా చేసినా మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అంటున్నారు. పండుగ పోటీ నుంచి దిల్ రాజు తప్పుకునే అవకాశాలు తక్కువే ఒకవేళ ఆయన తప్పుకున్నా సరే ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లోనే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఉందనే వాదన వినిపిస్తోంది. చూడాలి మరి చివరికి ఏం జరగబోతోంది అనేది.
 

Also Read: Punch Prasad Health : కదల్లేని పరిస్థితుల్లో పంచ్ ప్రసాద్.. సాయం చేయండని కోరిన నూకరాజు

Also Read: Ananya Panday Hot Photos: హద్దు దాటేసి అందాలు ఆరబోస్తున్న అనన్య..నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్ అంతే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Trending News