Balakrishna Praises Mahesh Babu in Unstoppable Show: టాలీవుడ్ అగ్రహీరో మహేష్ బాబు (Mahesh Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తన నటనతో 'సూపర్ స్టార్'గా ఎదిగారు. టాలీవుడ్‌కి ఎన్నో బంపర్ హిట్స్ ఇచ్చి మరోస్థాయికి తీసుకెళ్లారు. మహేష్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సేవాకారక్రమాలు కూడా చేస్తారు. తన రెమ్యూనరేషన్‌లో కొంత భాగం పలు స్వచ్చంద సంస్థలకు ఇస్తుంటారు. అయితే ఈ విషయాన్ని సూపర్ స్టార్ ఎక్కడా చెప్పలేదు. తాజాగా మహేష్ బాబు చేస్తున్న సాయం గురించి సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) చెప్పారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి మహేష్ రియల్ హీరో అనిపించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే' (Unstoppable with NBK) షో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా (Aha)లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే.  ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో విజయవంతంగా ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే 9 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్‌ ఫినాలేలోకి అడుగుపెట్టింది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు చివరి ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు. ఆయనతో పాటు స్టార్ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి కూడా వస్తున్నారు. ఈ గ్రాండ్‌ ఎపిసోడ్‌ ఫిబ్రవరి 4న 'ఆహా'లో స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా శుక్రవారం విడుదల చేసింది.


Also Read: Ganguly - Kohli: అవన్నీ గాలి వార్తలే.. అలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో: గంగూలీ


'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే' తాజా ప్రోమోలో మహేష్ బాబు చేస్తున్న గొప్ప పనిని (Mahesh Babu Saves 1000 Plus Childres) బాలకృష్ణ తెలియజేశారు. 'అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని అంటారు. ఆ అన్నదానం కంటే ప్రాణ దానం ఇంకా గొప్పదంటారు. వెయ్యికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి.. గుండెల్లో నిలిచిపోయాడు మన మహేష్' అంటూ సూపర్‌ స్టార్‌ని బాలయ్యబాబు ప్రశంసించారు. ఆపై మహేష్ చేసిన సాయంతో హార్ట్ ఆపరేషన్స్ చేయించుకుని ప్రాణాలను దక్కించుకున్న ఇద్దరు చిన్నారులను స్టేజ్ మీదికి తీసుకుని వచ్చారు. ఆరు మాసాలు అయితేనే కానీ ఏం చెప్పలేం అని డాక్టర్లు చెప్పారని ఆ చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవడంతో మహేష్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. 



చిన్నారి పరిస్థితి విని ఎమోషనల్ అయిన మహేష్ బాబు.. అసలు చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో చెప్పారు. 'గౌతమ్ ఆరు వారాలు ముందుగానే పుట్టాడు. నిజం చెప్పాలంటే పుట్టినప్పుడు సరిగ్గా నా చేయి అంతే ఉన్నాడు. ఇప్పుడు సిక్స్ ఫీట్ అయ్యాడు. మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి.. ఓకే. చాలామంది డబ్బు లేని వాళ్లు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటని అనుకున్నా. అలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలని అనుకున్నా. అప్పటి నుంచి చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నా' అని సూపర్ స్టార్ చెప్పగానే అందరూ ప్రశంసించారు. ఈ ప్రోమోకు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'మహేష్.. నువ్ రియల్ హీరో' అంటూ పొగిడేస్తున్నారు. 


Also Read: Akhanda Roar On Hotstar: బాలయ్య బాబునా మజాకా.. థియేటర్లలోనే కాదు ఇళ్లల్లో కూడా మాస్ జాతరే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook