Mahesh Babu: సిల్వర్ జూబ్లీ ఇయర్‌లో అడుగుపెట్టిన మహేష్ బాబు.. సంబరాలకు రెడీ అవుతున్న ఫ్యాన్స్..
Mahesh Babu@25 Years : హీరోగా మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. 1999లో హీరోగా నట ప్రస్థానం ప్రారంభించిన మహేష్ బాబు.. ఈ యేడాది హీరోగా సిల్వర్ జూబ్లీ (25 Years)లో అడుగు పెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలకు రెడీ అవుతున్నారు.
Mahesh Babu@25 Years:సూపర్ స్టార్ కృష్ణ (super star krishn) నట వారసుడిగా బాల నటుడిగా అడుగుపెట్టి చిన్నపుడే చిచ్చర పిడుగు అనిపించుకున్నాడు మహేష్ బాబు. అప్పటి వరకు బాల నటుడిగా ప్రేక్షకులను మెప్పించిన మహేష్ బాబు (Mahesh Babu).. ఆ తర్వాత చదవుకు కారణంగా కొన్నేళ్లు నటనకు గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాత కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజకుమారుడు' (Raja Kumarudu) సినిమాతో హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఈ యేడాదితో హీరోగా మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ ఇయర్‌లో అడుగు పెట్టబోతున్నాడు. ఈ మూవీ 1999 జూలై 30న విడుదలైంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ నిర్మించారు.
మొదటి సినిమా తర్వాత మహేష్ బాబు వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత 'మురారి'తో కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్‌గా అందుకున్నారు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఒక్కడు' మూవీతో స్టార్ అయ్యాడు. ఇక పోకిరి సినిమాతో సూపర్ స్టార్‌గా తన స్థానాన్ని సుస్ధిరం చేసుకున్నాడు. ఇపుడు వరుస విజయాలతో బాక్సాఫీస్ దగ్గర తన దూకుడు చూపిస్తున్నాడు. అంతేకాదు ఈ జనరేషన్‌లో దూకుడు మూవీతో తెలుగు సినిమాలకు ఓవర్సీస్‌లో మార్కెట్ ఓపెన్ చేసాడు. అంతేకాదు ఓవర్సీస్‌లో అత్యధిక వన్ మిలియర్ డాలర్స్ కలెక్ట్ చేసిన చిత్రాలు మహేష్ బాబువే కావడం విశేషం. అంతేకాదు వరుసగా 'భరత్ అను నేను', 'మహర్షి''సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' తాజాగా గుంటూరు కారం సినిమాలు రూ. 100 కోట్ల షేర్ అందుకున్నాయి. తెలుగులో మరే ఇతర హీరోలకు ఈ రికార్డులు లేవు. ఇక గుంటూరు కారం సినిమా కూడా నెగిటివ్ టాక్‌తో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టం మహేష్ బాబు స్టార్‌డమ్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు.
అంతేకాదు తన జనరేషన్‌లో అత్యధిక ప్రభుత్వ నంది అవార్డులను అందుకున్న హీరోగా కూడా రికార్డు క్రియేట్ చేసాడు. అంతేకాదు దాదాపు అన్ని సోషల్ దాంట్లో అన్ని జానర్స్‌ను టచ్ చేసాడనే చెప్పాలి. స్టార్ హీరోగా ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి వెనకాడలేదు. ఈ యేడాది మహేష్ బాబు 25వ ఇయర్‌లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ ఈ వీకెండ్‌లో మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం' సినిమాను వరల్డ్ వైడ్‌గా 25 థియేటర్స్‌లో అతని నమ్మకమైన అభిమనుల చేత ప్రదర్శించడానికి సన్నాహాలు మొదలు పెట్టారు.
Also Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?
Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook