SVP Trailer Leak: సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' మూవీని లీకుల బెడద వెంటాడుతోంది. గతంలో ఒకటి, రెండు పాటలు అఫీషియల్ రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో లీకయ్యాయి. తాజాగా ఏకంగా మూవీ ట్రైలరే లీకైపోయింది. ట్రైలర్‌కు సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతిలో తాళాల గుత్తితో మహేష్ విలన్లను చితకబాదుతున్న ఆ క్లిప్‌ను పలువురు నెటిజన్లు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఎక్కడి నుంచి లీకైందనేది తెలియలేదు.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సర్కారు వారి పాట ట్రైలర్‌ను మే 2, సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. సరిగ్గా అందుకు ఒకరోజు ముందు సోషల్ మీడియాలో ట్రైలర్ లీకవడం చిత్ర యూనిట్‌తో పాటు మహేష్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఈ లీకులు ఎవరు చేస్తున్నారు... ఎక్కడి నుంచి చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 


సర్కారు వారి పాట టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమాపై బజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌లో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కళావతి, పెన్నీ, సర్కారు వారి పాట టైటిల్ సాంగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమా పోకిరికి నెక్స్ట్ లెవల్ అంటూ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేశ్ చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.


మహేష్-కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సుబ్బరాజు, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: Repalle Rape case: రేపల్లెలో దారుణం..భర్త ముందే గ్యాంగ్ రేప్!


Also Read: TSPSC Group 1: రేపటి నుంచే గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తులు... అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలంటే... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook