TSPSC Group 1: రేపటి నుంచే గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తులు... అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలంటే...

TSPSC Group 1 Application Process: తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన కీలక వివరాలను ఇక్కడ తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2022, 12:11 PM IST
  • తెలంగాణలో కొలువుల జాతర
  • రేపటి నుంచే గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తులు
  • అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి
TSPSC Group 1: రేపటి నుంచే గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తులు... అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలంటే...

TSPSC Group 1 Application Process: తెలంగాణలో వరుసపెట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతుండటంతో నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. రాక రాక నోటిఫికేషన్లు రావడంతో ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలనే తపనతో చాలామంది చదువుల్లో తలమునకలయ్యారు. ఇప్పటికే పోలీస్, గ్రూప్-1 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్ 1 ఉద్యోగాలకు మే 2 నుంచి మే 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. పోలీస్ ఉద్యోగాలకు మే 2 నుంచి 20 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందో పరిశీలిద్దాం... 

దరఖాస్తు ప్రక్రియ ఇలా :

గ్రూప్-1 పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రేపటి (మే 2) నుంచి దరఖాస్తు లింకు యాక్టివేట్ అవుతుంది. 

ఓటీఆర్ డేటా బేస్‌లో అభ్యర్థులు తమ వివరాలు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. పుట్టిన తేదీ, పేరు, కమ్యూనిటీ, చిరునామా తదితర వివరాలు చెక్ చేసి 'కన్ఫర్మ్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఒకవేళ సవరణ అవసరమైతే... 'నో'పై క్లిక్ చేసి మార్పులు, చేర్పులు చేయవచ్చు. అనంతరం కన్ఫర్మ్‌పై క్లిక్ చేయాలి.

విద్యార్హతలతో పాటు ప్రాధాన్యత క్రమంలో 12 ఎగ్జామ్ సెంటర్స్‌ను ఎంపిక చేసుకోవాలి. పోస్టుల ప్రాధాన్యతను తెలియజేయాలి. ఆపై కన్ఫర్మ్‌ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి. 

రూ.200 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పరీక్ష ఫీజు  కింద రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికోద్యోగులతో పాటు డిక్లరేషన్‌ సమర్పించే నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఫీజులోనే ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.

ప్రిలిమ్స్ పరీక్షను అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు. పరీక్షా తేదీలను కమిషన్‌ త్వరలో ప్రకటిస్తారు. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి. 

Also Read: Video: ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అంపైర్‌తో పీవీ సింధు వాగ్వాదం... అసహనానికి లోనైన షట్లర్...   

Also Read: Acharya: 'చిరు', 'చిరుతకు' కూడా దక్కని అభిమానం.. రియల్ హీరోకి పూజలు, మామూలుగా లేదుగా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News