Mahesh Babu Summer Vacation మహేష్‌ బాబు తన ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. నమ్రత, సితార, గౌతమ్‌లతో కలిసి మహేష్ బాబు వెకేషన్‌కు వెళ్తుంటాడు. ఇక ఫారిన్ లొకేషన్‌లో షూటింగ్ అవుతుంటే కూడా ఫ్యామిలీని వెంట పెట్టుకుని వెళ్తుంటాడు మహేష్‌ బాబు. తాజాగా ఈ సమ్మర్ వేడిని తట్టుకోలేకనో త్రివిక్రమ్ తదుపరి షెడ్యూల్ మీద క్లారిటీ ఇవ్వలేదనో గానీ.. మహేష్‌ బాబు ప్రస్తుతం సమ్మర్ వెకేషన్‌కు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చినట్టే అని అర్థం అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమ్మర్ వెకేషన్‌కు మహేష్‌ బాబు వెళ్తున్నాడని తెలిసిన నిర్మాతలు హీరోని కలిశారట. అయితే త్రివిక్రమ్ నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో క్లారిటీ ఇవ్వమని మహేష్‌ బాబు అడిగాడట. వారం రోజుల్లో చెబుతామని నిర్మాతలు అన్నారట. దీంతో ఈ వారం రోజుల్లో సమ్మర్ ట్రిప్‌కు వెళ్లొస్తాను అని మహేష్ బాబు అన్నాడట. మూడు రోజులు వెకేషన్‌కు వెళ్తానని అన్నట్టుగా సమాచారం అందుతోంది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.


పవన్ కళ్యాణ్‌ సినిమా స్క్రిప్టులతో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడేమో అందుకే ఈ సినిమా షూటింగ్ గురించి అంతగా పట్టించుకోవడం లేదేమో అంటూ కౌంటర్లు వేస్తున్నారు. అసలే ఇప్పుడు త్రివిక్రమ్ ఎక్కువగా తన సొంత కథలు కాకుండా పవన్ కళ్యాణ్‌ కోసం స్క్రిప్టులు రెడీ చేయడంలోనే బిజీగా ఉంటున్నాడనే టాక్ ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే.


Also Read: Niharika Konidela : ఆమెతో కలిసి నైట్ సినిమా చూస్తూనే ఉందట.. ఎంజాయ్ చేస్తోన్న నిహారిక


వకీల్ సాబ్, భీమ్లా నాయక్, వినోదయ సిత్తం రీమేక్ ఇలా అన్నీ కూడా త్రివిక్రమ్ దగ్గరుండి వడ్డించినవే అన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకుడిగా అల వైకుంఠపురములో సినిమా తరువాత మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేకపోయాడు. అయితే ఇలా కథలు అందిస్తూ స్క్రిప్టులు రెడీ చేస్తూ బాగానే సంపాదించినట్టు తెలుస్తోంది. మహేష్‌ బాబుతో చేస్తోన్న ఈ మూవీ మీద త్రివిక్రమ్ ఎక్కువ ఫోకస్ పెట్టడం లేదని ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అవుతున్నారు.


Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook