Sitara Dance: తొలిసారి కూచిపూడి డ్యాన్స్ చేసిన సీతూ పాప.. ఆనందం వ్యక్తం చేసిన సూపర్ స్టార్!
Mahesh Babu shares daughter Sitara`s first Kuchipudi dance. ఇప్పటివరకు వెస్ట్రన్ డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్న టాలీవుడ్ `సూపర్ స్టార్` మహేష్ బాబు తనయ సితార.. తొలిసారిగా కూచిపూడి డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది.
Mahesh Babu's daughter Sitara kuchipudi dance video goes viral: టాలీవుడ్ 'సూపర్ స్టార్' మహేష్ బాబు తనయ సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో సందడి చేస్తూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మహేష్ బాబు హీరోగా వస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాలోని పెన్నీ సాంగ్‌లో సితార తళుక్కున మెరిసిన విషయం తెలిసిందే. సీతూ పాప చేస్తున్న మొదటి సినిమా కూడా ఇదే. ఇక ఇప్పటివరకు వెస్ట్రన్ డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్న సితార.. తొలిసారిగా కూచిపూడి డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది.
ఆదివారం దేశవ్యాప్తంగా 'శ్రీరామ నవమి' సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. సెలెబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. తన గారాలపట్టి సితార కూచిపూడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. వీడియోలో సితార సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతోంది. అంతేకాదు అద్భుతంగా డాన్స్ చేసింది.
'సితార మొదటి కూచిపూడి నృత్య ప్రదర్శన ఇది. ఈ శుభప్రదమైన శ్రీరామ నవమి రోజున ఈ వీడియోను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ శ్లోకం రాముడి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. నా సీతూ పాప అంకితభావం, తన టాలెంట్ చూస్తుంటే.. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సితార.. నువ్వు నన్ను మరింత గర్వపడేలా చేస్తున్నావు. సీతూకు కూచిపడి నేర్పించిన గురువులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు' అంటూ మహేశ్ బాబు వరుస ట్వీట్లు చేశారు. సితార డాన్స్ వీడియోపై ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం స్పందించారు. సీతూ పాప సూపర్ అని పేర్కొన్నారు.
మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ప్రొడక్షన్స్,14 రీల్స్ ఎంటటైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేసవి కానుకగా ఈ సినిమా మే 12న విడుదల అవనుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఈ చిత్రంకు ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Virat Kohli: థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి.. మైదానంలోనే బ్యాట్‌తో.. (వీడియో)
Also Read: Virat Craze: విరాట్ సెంచరీ చేసేవరకూ డేటింగ్ చేయను..వైరల్ అవుతున్న అమ్మాయి బ్యానర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook