Virat Kohli: థర్డ్ అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి.. మైదానంలోనే బ్యాట్‌తో.. (వీడియో)

Virat Kohli fires on Third umpire over LBW. థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చిన కోపంలో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌ను మైదానంలోనే నేలకేసి బాదాడు. అనంతరం కూడా బౌండరీ రోప్‌ను కొట్టుకుంటూ వెళ్లాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2022, 12:40 PM IST
  • ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి
  • థర్డ్ అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి
  • మైదానంలోనే బ్యాట్‌తో
Virat Kohli: థర్డ్ అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి.. మైదానంలోనే బ్యాట్‌తో.. (వీడియో)

IPL 2022, RCB vs MI: Virat Kohli fires on Third umpire over Controversial LBW Decision: ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) హవా కొనసాగుతోంది. శనివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో గెలుపొంది మెగా టోర్నీలో హ్యాట్రిక్ విజయం అందుకుంది. ముంబై నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ 18.3 ఓవర్లలోనే ఛేదించింది. బెంగళూరు ఓపెనర్ అనుజ్‌ రావత్ (66; 47 బంతుల్లో 2×4, 6×6) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ (48; 36 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే ఈ మ్యాచులో థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

విషయంలోకి వెళితే... ఆర్‌సీబీ ఛేదన సందర్భంగా ముంబై ఇండియన్స్ బౌలర్ డెవాల్డ్ బ్రేవిస్ 19వ ఓవర్ వేశాడు. బ్రేవిస్ వేసిన తొలి బంతి వికెట్ల మీదకు దూసుకు రాగా.. విరాట్ కోహ్లీ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్‌, ప్యాడ్‌ను తాకింది. వెంటనే ముంబై ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. అయితే బంతి బ్యాట్‌కు తాకిందనే నమ్మకంతో ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ రివ్యూ తీసుకున్నాడు.

థర్డ్ అంపైర్ రిప్లేలో పలు కోణాల్లో పరిశీలించగా.. ఒక యాంగిల్‌లో బంతి ముందుగా బ్యాట్‌కు తగిలి ఆపై ప్యాడ్‌ను తాకినట్లు కనిపించింది. మరో యాంగిల్‌లో బ్యాట్, ప్యాడ్‌ను ఒకేసారి తాకినట్లు కనిపించింది. దాంతో థర్డ్ అంపైర్ బాల్ ట్రాకింగ్‌ను చెక్ చేశాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను తాకడంతో.. ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి విరాట్ కోహ్లీని ఔట్‌గా ప్రకటించాడు. దాంతో బ్యాట్‌కు తాకినట్లు స్పష్టంగా తెలుస్తున్నా.. ఔట్ ఎలా ఇస్తారని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. 

థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చిన కోపంలో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌ను మైదానంలోనే నేలకేసి బాదాడు. అనంతరం కూడా బౌండరీ రోప్‌ను కొట్టుకుంటూ వెళ్లాడు. డగౌట్ కు చేరుకుంటూ దూర్భాషలాడుకుంటూ వెళ్లాడు. ఇందుకు సంబందించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో ఆర్‌సీబీ ఫాన్స్ కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే కోహ్లీ ఇలా చేయడం ఇదేం కొత్తకాదు. గతంలో కూడా కోహ్లీ మైదానంలో అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

Also Read: Pakistan Crisis: పాకిస్తాన్‌లో గెలిచిన అవిశ్వాసం, కుప్పకూలిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం, కొత్త ప్రధాని ఎవరు

Also Read: Virat Craze: విరాట్ సెంచరీ చేసేవరకూ డేటింగ్ చేయను..వైరల్ అవుతున్న అమ్మాయి బ్యానర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News