Mahesh Babus son Gautam Ghattamaneni: సాధారణంగా ఇతర రంగాల సిలబ్రిటీల కంటే సినీతారలకు ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. తమ అభిమాన హీరో ఏం చేస్తున్నాడు, నటి లేటెస్ట్ అప్‌డేట్స్ విషయాల కోసం సెర్చ్ చేస్తుంటారు. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై ఫ్యాన్స్ ఆసక్తి చూపుతారు. సెలబ్రిటీలు సైతం తమ సంతానం చేసే చిన్న పనులకు సైతం మురిసిపోతుంటారు. అలాంటిది ఏదైనా సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్‌లో బెస్ట్ సెలబ్రిటీ కపుల్స్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ తప్పక ఉంటారు. మహేష్ బాబు, నమ్రతా చాలా సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నారు. అందుకు కారణం వారి కుమారుడు గౌతమ్ ఘట్టమనేని. తెలంగాణలోని బెస్ట్ స్మిమ్మర్స్‌లో టాప్ 8లో గౌతమ్ చోటు దక్కించుకున్నాడు. అతడి వయసు గ్రూప్ కాంపీటీషన్స్‌లో గౌతమ్ కూడా బెస్ట్ స్విమ్మర్ అని చాలా మందికి తెలియదు. కుమారుడి ఘనతు వివరిస్తూ మహేష్ బాబు (Mahesh Babu) భార్య, నటి నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వివరాలు షేర్ చేసుకున్నారు. 


Also Read: Actress Kavitha’s son died: కరోనాతో కవిత కుమారుడు మృతి, భర్త పరిస్థితి విషమం



గౌతమ్ 2018లో ప్రొఫెషనల్ స్మిమ్మింగ్ ప్రారంభించాడు. ప్రస్తుతం అతడి వయసు గ్రూప్ స్విమ్మర్స్‌లో తెలంగాణలో టాప్ 8లో నిలిచాడు. కుమారుడి ఘనతపై తల్లిగా నాకు చాలా గర్వంగా ఉంది. ఇష్టంతోనే గౌతమ్ ఈ స్పోర్ట్ అలవాటు చేసుకుని హార్డ్ వర్క్ చేస్తున్నాడు. గౌతమ్ నాలుగు రకాల స్విమ్మింగ్ స్టైల్స్ బటర్‌ఫ్లై, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్ మరియు ఫ్రీస్టైల్ రకాలలో స్విమ్మింగ్ చేయగలడం విశేషం. ఫ్రీస్టైల్ విధానంలో గౌతమ్ 3 గంటల్లో ఏకధాటిగా స్విమ్మింగ్ చేసి 5 కిలోమీటర్లు చేరుకున్నాడని నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) వెల్లడించారు.  


Also Read: Hyper Aadi apology video: హైపర్ ఆది సారీ చెప్పాడు.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook