Mahi V Raghav Hits: మహి వి.రాఘవ్ నిర్మాణంలో రూపొందించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 ఇంటిల్లిపాదిని అలరిస్తోంది. వెబ్‌ సిరీస్‌లోనే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సిరీస్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ తొలి వారంలోనే వీక్షకులపరంగా రికార్డులు నెలకొల్పింది. ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 1 బ్లాక్ బస్టర్ కాగా.. తర్వాత ‘సైతాన్’ సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా ‘సేవ ది టైగర్స్’ సీజన్ 2 బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగు ఓటీటీలో మహి వి.రాఘవ్ హ్యాట్రిక్ విజయాలు సాధించి ప్రత్యేకతను చాటాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సేవ్‌ ది టైగర్స్‌' ఊహించని విజయం సాధించడంతో మహి రాఘవ తాజాగా మీడియాతో మాట్లాడారు. తన విజయానందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మహి మాట్లాడుతూ.. ‘మంచి విజయాలను అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. రోజూ మనతో పాటు మన చుట్టూ జరిగే సరదా సన్నివేశాలు, దంపతుల మధ్య సాగే సంభాషణలతో పాటు భావోద్వేగాలను 'సేవ ద టైగర్స్‌'తో ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. నటీనటులు అద్భుతంగా నటించడంతో మే అనుకున్నట్లుగా ఇది వచ్చింది. మన మూలాలకు సంబంధించిన కథలను చెప్పటానికి ప్రయత్నిస్తాను. ఆవిధంగా చేయడంతోనే ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది' అని తెలిపారు.

Also Read: Rakul Strong Counter: పెళ్లయితే పద్ధతిగా ఉండాలా? అందాలు దాచుకోవాలా? రకుల్‌ ప్రీత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌


 


రెండు సిరీస్‌లకు మధ్య తేడాను వివరిస్తూ.. 'సేవ్ ది టైగర్స్ తొలి భాగంలో ఒత్తిడితో గురయిన భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే విషయంపై ఉంటే, రెండో భాగంలో వారి బాధ్యతలు, మానసిక పరిపకత్వ ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. సీజన్ 1 చాలా పెద్ద హిట్టవడంతో రెండో భాగంపైఒత్తిడిగా లోనయ్యాను. ఇలాంటి విభిన్న కంటెంట్‌ను చేయాలనుకున్నప్పుడు చమత్కారంతో కూడిన రచన అనేది ఎంతో అవసరం. మా త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై కొత్త రైటర్స్, దర్శకులను ప్రోత్సహిస్తున్నాం' అని తెలిపారు. తమ బ్యానర్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే మరికొన్ని వెబ్ షోలను రూపొందించటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

Also Read: Jyotika Strong Reply: 'హీరో సూర్యను భర్తగా నాకు అప్పు ఇస్తావా?' హీరోయిన్‌ జ్యోతిక ఘాటు రిప్లయ్‌


అరుణ్‌ కొత్తపల్లి దర్శకత్వంలో రూపొందిన 'సేవ్‌ ద టైగర్స్‌' వెబ్‌ సిరీస్‌లో ప్రియదర్శి, జోర్దార్‌ సుజాత, అభినవ్‌ గోమటం, కృష్ణ చైతన్య, సీరత్‌ కపూర్‌, పావని గంగిరెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పార్ట్‌-2 మార్చి 15వ తేదీ నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా పరిచయమైన మహి వి రాఘవ్‌ రచయిత, నిర్మాత, దర్శకుడిగా పలు పాత్రలు పోషిస్తున్నాడు. ఇలా వివిధ రూపాల్లో సినీ పరిశ్రమకు సేవ చేస్తూ మహి రాఘవ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు. 'త్రీ ఆటమ్ లీవ్స్' పేరిట బ్యానర్‌ను ప్రారంభించిన మహి దర్శకుడి‌గా, నిర్మాతగా వ్యవహరిస్తూనే షో రన్నర్‌గానూ వెబ్ సిరీస్‌లను కూడా రూపొందిస్తున్నాడు. ఏ కళారూపంలోనైనా మహి విజయాలు సొంతం చేసుకుంటుండడం విశేషం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter