Netflix: కరోనా మహమ్మమారి సమయం నుంచి ఓటీటీలకు ఆదరణ భారీగా పెరిగింది. నచ్చిన కంటెంట్ నచ్చిన సమయంలో నచ్చిన భాషలో చూసే వీలుండటంతో ఓటీటీలంటే ఆసక్తి పెరిగింది. ప్రస్తుత రోజుల్లో బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓటీటీ అనే చెప్పవచ్చు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా డిమాండ్ ఆధారంగా వసూళ్లు మొదలెట్టేశాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం చాలా రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఆహా, జీ5, నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్, జియో సినిమా ఇలా చాలానే ఉన్నాయి. అన్నింటికంటే అత్యధికంగా ప్రాచుర్యం పొందిన ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ అని చెప్పవచ్చు. నెట్‌ఫ్లిక్స్ అంటే ఆసక్తి చూపించే యూజర్లు ఎక్కువగా ఉంటారు. మార్కెట్లో ఉన్న డిమాండ్ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ నిబంధనలు కఠినం చేసి ఇప్పటికే యూజర్లకు షాక్ ఇచ్చింది. పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితిని విధించింది. అంటే పాస్‌వర్డ్ షేరింగ్ చేయకూడదు. చేస్తే చర్యలు తప్పవు. ఎప్పుడైతే పాస్‌వర్డ్ షేరింగ్‌పై కొరడా ఝులిపించిందో 6 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు. ఇప్పుడు ఇదే సంస్థ యూజర్లకు మరోసారి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 


నెట్‌ఫ్లిక్స్ ఈసారి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల్ని పెంచేందుకు యోచిస్తోంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు సబ్‌స్క్రిప్షన్ పెంచుకోవాలని సంస్థ నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే మరో ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు పెంచింది. ఇపుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ బాటలోనే నెట్‌ఫ్లిక్స్ కూడా పయనించనుంది. ధరలు ఎంత పెంచుతుందనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది. పాస్‌వర్డ్ కట్టడి తరువాత చాలామంది యాడ్ ఫ్రీ ప్లాన్స్ ఎంపిక చేసుకున్నారు. యాడ్స్‌తో సబ్‌స్క్రిప్షన్ ప్రస్తుతం నెలకు 6.99 డాలర్లు కాగా యాడ్స్ ఫ్రీ అయితే 15.49 డాలర్లుగా ఉంది. 


Also read: Janhvi Kapoor: బ్లాక్ డ్రెస్‌లో జాన్వీ కపూర్ టెంప్టింగ్ పోజులు.. కుర్రకారుకు నిద్రపట్టేనా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook