Ram Charan's sets moments, actions scenes reels for RRR : మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ( Ram Charan), యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ల స్పీడు పెంచింది. ఓ వైపు స్పెషల్‌ ఇంటర్వ్యూలు, వేడుకలు చేస్తూనే.. మరోవైపు కొత్త పోస్టర్లు, గ్లింప్స్‌లతో ఆసక్తి రేకెత్తిస్తోంది. తాజాగా ఆ జాబితాలోకి మేకింగ్‌ వీడియోలు కూడా చేరాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే జూనియర్‌ ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ వీడియోను వదిలిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రబృందం.. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పోషించిన అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) పాత్రకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం చరణ్ చాలా కష్టపడ్డాడు. అలానే షూటింగ్ సమయంలో డైలాగ్స్, ఆక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా చరణ్ చేసే వ్యాయామాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. చరణ్ తన పాత్ర ఎంత కష్టపడ్డాడో ఈ రీల్స్ తెలియజేస్తున్నాయి. ఇందుకు సంధించిన మేకింగ్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Also Read: Yasir Shah: మైనర్‌పై అత్యాచారం.. పాకిస్తాన్ స్టార్ ఆటగాడిపై ఎఫ్ఐఆర్ నమోదు! ఇక కెరీర్ కంచికే!!


అంతకుముందు జూనియర్‌ ఎన్టీఆర్ (Jr NTR) పోషించిన కొమురం భీమ్‌ (Komaram Bheem) పాత్రకు సంబంధించిన చిత్రీకరణను కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం వదిలింది. అందులో ఎన్టీఆర్ బైక్‌ డ్రైవింగ్‌, అడవిలో పరిగెత్తే సన్నివేశాలు, ప్రాక్టీస్‌ చేసే దృశ్యాలు బాగున్నాయి. 'భీమ్' పాత్ర కోసం ఎన్టీఆర్‌ ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో తారక్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్, రామ్ చరణ్ ( Ram Charan) సరసన బాలీవుడ్ స్టార్ అలియా భట్ (Alia Bhatt) కనిపించనున్నారు. ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ శరన్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల అయిన పాటలు, ప్రోమో, పోస్టర్స్ ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. యావత్‌ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 


Also Read: Omicron Detection Kits: ఒమిక్రాన్ వేరియంట్ గుర్తింపు ఇకపై సులభం, త్వరలో డిటెక్షన్ కిట్లు







స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook