Vinayakan viral video: సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.  ఈ క్రమంలోనే ఇటీవల ఈయన నటించిన చిత్రాలలో జైలర్, వేట్టయాన్ చిత్రాలు కూడా వున్నాయి. ఇకపోతే జైలర్ సినిమా భారీ విజయాన్ని అందుకొని, రజనీకాంత్ స్టామినాని మరోసారి నిరూపించింది. ఇక ఇందులో విలన్ గా నటించారు మలయాళ నటుడు వినాయకన్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా ఈయన గోవా వీధుల్లో ఒక దుకాణం విక్రేతతో మాటలతో వాగ్వాదం పెట్టుకున్నట్లు ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో వినాయకన్.. అ దుకాణదారుడుతో బిగ్గరిగా వాదించుకుంటూ గొడవ పడడం కనిపించింది. వెంటనే నటుడు తన మాటల దుర్వినియోగాన్ని కొనసాగించడంతో జనాలు గుమిగూడారు. 


ఇకపోతే గొడవకు గల కారణం ఏమిటి..? అనే విషయం తెలియదు. కానీ నెటిజన్లు మాత్రం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మత్తులో ఉన్నాడు అందుకే అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు అంటూ కామెంట్లు చేయగా.. మరికొంతమంది ఇది ఒక సినిమాలోని సీన్ అయి ఉండొచ్చు కదా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. 


 



మొత్తానికైతే వినాయకన్ గోవాలోని వీధి దుకాణదారుడుతో పడ్డ గొడవ సంచలనంగా మారింది. వాస్తవానికి సెలబ్రిటీలు ఏ విషయంపై ఏం చేసినా అది ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే దర్శక నిర్మాతలు కూడా ఈమధ్య ప్రజలను అట్రాక్ట్ చేయడానికి ఏవేవో చేస్తున్నారు. 


ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా కూడా ఇలా చేసి ఉండవచ్చు కదా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా వీధి వ్యాపారితో వినాయకన్ గొడవ మాత్రం బాగా హైలైట్ అవుతోంది. మరి ఈ గొడవ ఎందుకు మొదలైంది? దేనికోసం మొదలయ్యింది? అనే విషయాలు తెలియాలి అంటే వినాయకన్ స్పందించక తప్పదు.


ఇకపోతే  వినాయకన్ గొడవ పడడం ఇదే మొదటిసారి కాదు. ఇదే ఏడాది సెప్టెంబర్లో గోవా నుండి కొచ్చికి ప్రయాణిస్తున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో  గొడవపడ్డారు. సిఐఎస్ఎఫ్ అధికారులు అతడిని మత్తులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారట. ఇక ఈ విషయాన్ని పోలీసులు తెలియజేశారు. ఇకపోతే కొంతకాలం తర్వాత ఈయనను బెయిల్ మీద విడుదల చేశారు.


Read more: Garikapati Narasimharao: తగ్గెదేలా అంటావా..?.. మీ అందర్ని కడిగేస్తా.. పుష్పా- 2 మీద రెచ్చిపోయిన గరికపాటి.. వీడియో ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter