Malayam Film Actor Rizabawa Passes Away: ప్రముఖ మలయాళ నటుడు రిజబావా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 55 ఏళ్లు. కొచ్చి(Kochi)లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ(Kidney Treatment)కి సంబంధించిన చికిత్స తీసుకుంటూ సోమవారం చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా 19వ దశాబ్దంలో మలయాళ చిత్రసీమలో ప్రతినాయకుడి(villain)గా పలు పాత్రలు పోషించి మంచిపేరు సంపాదించారు. రిజబావా మృతిపట్ల నటులు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అక్షయ ప్రేమ్‌నాథ్ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1990లో షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన  డాక్టర్ పశుపతి(Dr. Pashupati) అనే చిత్రంలో రిజాబావా తొలిసారిగా నటించారు. అదే ఏడాది వచ్చిన కామెడీ థ్రిల్లర్‌ ‘ఇన్ హరిహర్ నగర్‌(In Harihar Nagar)’లో జాన్ హొనై(John Honai) పాత్ర ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడ నుండి ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. దాదాపు 150 చిత్రాలలో నటించిన రిజబావా పలు టీవీ సీరియల్స్ లోనూ చేశారు. చివరగా ఆయన మమ్ముట్టి నటించిన ‘వన్’(One) చిత్రంలో నటించారు.


Also Read: Uttej Wife Padmavati Passed Away: ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం..


రిజబాబా కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఆయన సినిమాల్లో నటించడం లేదు. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook