Vijay Last Movie Thalapathy 69 Cast: తమిళ్ సూపర్ స్టార్ విజయ్.. ఇప్పుడు GOAT గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం.. సినిమాతో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు..దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న ఈ సినిమా థియేటర్లను విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత విజయ్ హెచ్.వినోద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. తలపతి కెరీర్లో ఇది 69వ సినిమాగా..ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా తన ఆఖరి సినిమా అని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా తర్వాత విజయ్ కేవలం.. రాజకీయాలతో మాత్రమే బిజీగా ఉండబోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన లుక్ టెస్ట్.. చెన్నైలో జరిగింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాలని.. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల చేయాలని ఈ చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. GOAT సినిమా విడుదలైన తర్వాత విజయ్.. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ప్రముఖ మలయాళం నటుడు మోహన్ లాల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. స్టార్ బ్యూటీ సమంత.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. 


అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మరొక హీరోయిన్ ని.. రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు మమిత బైజు. మలయాళంలో.. ఈ మధ్యనే సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమాతో.. తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది ఈ భామ.


మమిత విజయ్ ఆఖరి సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమె రెండో హీరోయిన్ పాత్ర పోషిస్తుందా.. లేక మరేదైనా కీలక పాత్రలో కనిపించనుందా.. అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు.


Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter