Malayali Aparna Das makes her Telugu debut: ఈమధ్య కాలంలో తెలుగు సినిమాల్లోకి ఇతర భాషల నుంచి హీరోయిన్స్ ను తీసుకొస్తున్న సంఖ్య గట్టిగానే పెరుగుతుంది. వాస్తవానికి తెలుగు కుటుంబాల్లో పుట్టి చాలామంది అమ్మాయిలు తమిళ అలాగే హిందీ పరిశ్రమల్లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తుంటే మన తెలుగు మేకర్స్ మాత్రం మలయాళీ, తమిళ భామలను మన మార్కెట్లోకి దించుతున్నారు. ఇప్పటికే అనేకమంది మలయాళీ భామలు, కన్నడ భామలు, తమిళ భామలు టాలీవుడ్ ని ఏలే ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు ఒక మలయాళీ భామను మళ్లీ కొత్తగా దించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమె పేరు అపర్ణ దాస్, ఎక్కువగా మలయాళ సినిమాల్లో అప్పుడప్పుడు తమిళ సినిమాల్లో కనిపించే ఆమె బీస్ట్ సినిమాలోని అపర్ణ అనే తన పాత్రకు అలాగే మలయాళంలో మనోహరం అనే సినిమా ద్వారా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు ఆమె తెలుగులో హీరోయిన్గా ఎంపికైంది. పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన చేసిన కొండపొలం, రంగ రంగ వైభవంగా వంటి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.


దీంతో పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, ఎస్ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే వైష్ణవ తేజ్ సరసన హీరోయిన్గా శ్రీ లీల ఎంపికైంది. ఇప్పుడు ఆమెతో పాటుగా అపర్ణ దాసుని కూడా రంగంలోకి దించారు మేకర్స్.


Also Read: Shraddha Das Photos: ఢీ షో కోసం శ్రద్దా దాస్ హాట్ ట్రీట్.. ఎద అందాల ఎర


అంతేకాదు ఈ సినిమాలో ఆమె పాత్రకు ఒక పేరు కూడా ఫిక్స్ చేసి అందరిలోనూ ఆసక్తి రేకెత్తించారు. ఈ సినిమాలో అపర్ణ దాసు నటించబోతున్న పాత్ర పేరు వజ్రకాళేశ్వరి దేవి.   ఇక అపర్ణ దాస్ కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే ఆమె 1995వ సంవత్సరంలో మస్కట్లో జన్మించింది. అక్కడే సెటిల్ అయినా మళయాళ దంపతులకు జన్మించిన ఆమె అక్కడే ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసుకుంది. ఆ తర్వాత ఇండియా వచ్చేసిన ఆమె కోయంబత్తూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది.


గ్రాడ్యుయేషన్ అయ్యాక అకౌంటెంట్గా కొన్నాళ్లు పనిచేసిన ఆమె అదే సమయంలో మోడల్ గా కొన్ని మ్యాగజైన్స్ కి కూడా పనిచేసింది. ఇక మస్కట్ వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో ఆమెకు 2018 సంవత్సరంలో ఎన్జాన్ ప్రకాశన్ అనే సినిమాలో ఒక పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఇక ఆ తర్వాత మనోహరం అనే సినిమాలో ఆమెకు హీరోయిన్ గా నటించే అవకాశం కూడా దక్కింది. ఇక ఆ సినిమా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు కానీ తమిళంలో భారీ బడ్జెట్ తో భారీ స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కిన బీస్ట్ సినిమాలో మాత్రం అపర్ణ అనే పాత్ర చేసింది. అయితే బీస్ట్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమెకు వెంటవెంటనే సినిమా అవకాశాలు దక్కలేదు.


తర్వాత మలయాళంలో ఒక సినిమా తమిళంలో ఒక సినిమా చేసింది. ప్రస్తుతానికి మలయాళంలో సీక్రెట్ హ్యూమన్ అనే ఒక సినిమాలో నటిస్తోంది. అలాంటి ఆమెకు ఇప్పుడు తెలుగులో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ రావడంతో ఇక ఆమె దశ తిరిగినట్టే అంచనాలు వెలువడుతున్నాయి. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వక ముందు ఆమె కొన్ని మ్యూజిక్ వీడియోస్ తో పాటు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా కనిపించింది. ఇక అలా ఆమె నటన మీద ఉన్న ఆసక్తితో ఎట్టకేలకు హీరోయిన్గా మారటమే కాదు ఇతర సినిమాల్లో హీరోయిన్ పాత్రలు దొరకపోయినా సినిమాల్లో నటిస్తే చాలు అనుకుని బీస్ట్ వంటి సినిమాల్లో నటించింది.
Also Read: Yashika Aannand Photos: చీరకట్టులో యషికా ఆనంద్ అందాల విందు.. చూసి తట్టుకోగలరా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook