Naresh VK and Pavithra Lokesh Starrer Malli Pelli Trailer Released: టాలీవుడ్ సీనియర్‌ నటుడు నరేశ్‌, నటి పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. నరేశ్ హోంబ్యానర్ విజయ కృష్ణ మూవీస్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్‌ నటులు అన్నపూర్ణ, జయసుధ, శరత్‌ బాబు కీలక పాత్రలు చేస్తున్నారు. నరేశ్‌ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కినన్న ఈ సినిమా మే 26న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 నిమిషాల 33 సెకండ్ల నిడివి గల మళ్లీ పెళ్లి ట్రైలర్ (Malli Pelli Movie Trailer).. 'తెలుగు ఇండస్ట్రీ కన్నడపై చూపు తిప్పిందేంటి' అనే వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది. భారతి మీ ఆయన బాగా చేసుకుంటాడా?, పెళ్లైన ఆవిడతో మీకు లవ్ ఏంటి సర్, మీది పడి పడక లేచే వయసు.. ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు పడుతుందో తెలియదు, అసలైన సూపర్ స్టార్ పెద్దాయన అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నరేశ్‌ (Naresh VK), పవిత్రా లోకేశ్‌ (Pavithra Lokesh) ప్రేమ వ్యవహారం, పెళ్లి టాపిక్‌, నరేశ్‌కు అతని మూడో భార్య రమ్య రఘుపతికి మధ్య జరిగే కాంట్రవర్సీల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ట్రైలర్‌ చూస్తే అర్ధమవుతోంది. 


ట్రైలర్‌ చూస్తుంటే.. కొన్నాళ్లుగా నరేశ్‌ నిజ జీవితంలో జరిగిన, జరుగుతున్న వ్యవహారాలను డైరెక్టర్‌ ఎంఎస్ రాజు ఉన్నది ఉన్నట్టుగా చూపించబోతున్నట్టు ట్రైలర్‌తో అర్థమవుతోంది. నరేశ్, పవిత్రా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి మళ్లీ పెళ్లి అనే టైటిల్‌తో సినిమా చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో, టీజర్‌ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. ట్రైలర్ కూడా అందరిని ఆకట్టుకుంటోంది. 


మళ్లీ పెళ్లి చిత్రానికి సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎన్‌ బాల్‌రెడ్డి కెమెరామెన్‌. మళ్లీ పెళ్లి ట్రైలర్ చూసి అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్  చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. ఆలస్యం ఎందుకు మీరు చూసి ఎంజాయ్ చేయండి.