Mallidi Vasishta: పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇచ్చిన దగ్గర నుంచి చిరంజీవికి ఆయన స్థాయికి తగిన సూపర్ హిట్ సినిమా రాలేదని చెప్పాలి. ఈమధ్య ఆయన చేసిన చిత్రాలలో కేవలం వాల్తేరు వీరయ్య మాత్రమే కలెక్షన్స్ పరంగా సక్సెస్ సాధించింది. కానీ వాల్తేరు వీరయ్య సినిమా కథ కూడా మెగాస్టార్ స్థాయికి తగిన కథ అయితే మాత్రం కాదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే ఎన్నో సంవత్సరాల నుంచి మెగా అభిమానులు తమ హీరో  స్టేటస్ కి తగిన ఒక మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఒకపక్క రజినీకాంత్, కమల్ హాసన్, బాలకృష్ణ లాంటి వారు తమ వయసుకు తగిన పాత్రలు చేస్తూ సూపర్ హిట్ సాదిస్తూ ఉంటే.. చిరంజీవి మాత్రం రొటీన్ కథలను ఎంచుకోవడం ప్రేక్షకులను బాధపెడుతోంది.


ఈ నేపథ్యంలో ఆయన అభిమానులకు రిలీఫ్ గా ప్రకటించిన ప్రాజెక్ట్  మెగా 156. కళ్యాణ్ రామ్ కి బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల తరువాత చిరంజీవి రీమేక్లు, కమర్షియల్ ఫార్ములాలు పక్కన పెట్టి కొంచెం కొత్తగా ఈ చిత్రంతో ట్రై చేయానున్నారని తెలుస్తోంది.


యువి క్రియేషన్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ఠ ఈ భారీ సోషియో ఫాంటసీ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. కీరవాణి సంగీతం అందించనున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఈ మధ్యనే విడుదల అయ్యి అందరిలో ఆసక్తి తెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది.


ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక ఆంగ్ల పత్రిక వారితో తాజాగా ముచ్చటించిన దర్శకుడు వశిష్ట మెగాస్టార్ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ముందుగా చిరంజీవి గురించి మాట్లాడుతూ..తన చిన్నతనంలో మెగాస్టార్ గారి జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ చూసి ఎంతో ఆశ్చర్యపోయానని అన్నారు. అలానే ఆ విధమైన సోషియో ఫాంటసి మూవీని మెగాస్టార్ మళ్ళి చేయలేదని, మధ్యలో అంజి వచ్చినప్పటికీ అది పూర్తి స్థాయి ఫాంటసీ మూవీ కాదని అన్నారు.


ఇక తన సినిమా గురించి మాట్లాడుతూ…మళ్లీ చిరంజీవికి జగదేకవీరుడు.. అతిలోకసుందరి లాంటి పూర్తి స్థాయి ఫాంటసీ మూవీ ఇవ్వాలి అనేది తన లక్ష్యం అని అన్నారు. అందుకే ప్రస్తుతం తీయబోయే మూవీ విషయమై ఎంతో శ్రద్ధ తీసుకుని ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇందులో అందరి దృష్టిని ఆకట్టుకున్న విషయం ఏమిటి అంటే ఈ చిత్రం లో దాదాపుగా డెబ్భై శాతానికి పైగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని దర్శకుడు ఖరారు చేయడం. 


ఇక తప్పకుండా ఈ సినిమాలో చిరంజీవి గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ అందరూ ఆయన నుండి ఆశించే అంశాలు ఉంటాయని తెలిపారు.


Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం


Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి