Mammootty Birthday Special: మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి (Mammoty) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రముఖులు కూడా విషెస్‌ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. మమ్ముట్టి బర్త్ డే ను పురస్కరించుకుని ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను మేకర్స్ ప్రకటిస్తున్నారు. మమ్ముట్టి కొత్త సినిమా భ్ర‌మ‌యుగం (Bramayugam). ఈ చిత్రానికి భూతకాలం (Bhoothakaalam 2022) ఫేమ్ రాహుల్ సదాశివన్ (Rahul SadaShivan) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని మలయాళంతోపాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా భ్ర‌మ‌యుగం టీమ్ సాలిడ్ అప్ డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మమ్ముట్టి లుక్ చాలా భయంకరంగా ఉంది. ఈ మూవీ కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో తెరకెక్కనుంది. మాలీవుడ్ తోపాటు టాలీవుడ్ లోనూ సమానమైన మార్కెట్ ఉన్న నటుల్లో మమ్ముట్టి ఒకరు. రీసెంట్ గా ఈయన తెలుగులో చేసిన చిత్రాల్లో యాత్ర (Yatra), ఎజెంట్ (Akhil Agent) ఉన్నాయి. ఇందులో యాత్ర సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 



మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan) ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ''నాన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పటికీ ఇలాగే ప్రపంచం మొత్తానికీ వినోదాన్ని పంచుతూ ఎంతో మందికి స్ఫూర్తినివ్వండి''’ అంటూ మమ్ముట్టితో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మమ్ముట్టి. 


Also Read: Siddarth New Movie: కూతురు సెంటిమెంట్ తో సిద్ధార్థ్‌‘'చిత్తా'’టీజ‌ర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook