Bramayugam OTT Release Date: మమ్ముట్టి `భ్రమయుగం` ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఏ ఫ్లాట్‌ఫామ్ అంటే..
Mammootty Bramayugam OTT: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం మలయాళానికే పరిమితం కాకుండా ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో సత్తా చాటారు. అంతేకాదు ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుంటారు. రీసెంట్‌గా ఈయన భ్రమయుగం సినిమాతో పలకరించారు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Mammootty Bramayugam OTT: మమ్ముట్టి ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఎపుడు వెనకాడలేదు. ఈ డిజిటల్ యుగంలో కలర్‌లో కాకుండా బ్లాక్ వైట్‌లో 'భ్రమయుగం' సినిమాతో పలకరించారు. ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కానీ మిగతా భాసల్లో ఈ సినిమా పెద్దగా నడవలేదు. మరోవైపు ఈ సినిమాలో మమ్ముట్టి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ముందు నుంచి మమ్ముట్టి ఒక మూసకు పరిమితం కాకుండా డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంటారు. తన ఇమేజ్‌కు ఆ కథ సరిపోతుందా లేదా అనే డౌట్స్ పెట్టుకోకుండా.. కాన్సెప్ట్ నచ్చితే వెంటనే చేసేయడం మమ్ముట్టి వర్కింగ్ స్టైల్. ఫ్యాన్స్ ఏమనుకుంటారో అనే డౌట్స్ కూడ పెట్టుకోకుండా తనకు తోచిన స్టోరీలను సినిమాలుగా చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఈ కోవలోనే ఈయన మూడు సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు.
ఈ సినిమాను రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్ధ భరతన్, అమల్డా లిజ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా మొత్తం ఓ అడవిలో ఉండే కుగ్రామం నేపథ్యంలో డిఫరెంట్ కాన్సెప్టతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను ఈ నెల 15 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, తమిళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
మమ్మట్టి విషయానికొస్తే.. ఆ మధ్య తెలుగులో 'యాత్ర' మూవీతో పలకరించారు. ఇందులో దివంగత ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించారు. రీసెంట్‌గా 'యాత్ర 2'లో అదే పాత్రను చేసారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అందుకు తగ్గ వసూళ్లను రాబట్టడంలో విఫలమైంది. ఆ తర్వాత వెంటనే 'భ్రమయుగం' మూవీతో మమ్ముట్టి పలకరించారు. ఈ సినిమా మలయాళ బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. మరి ఓటీటీ వేదికగా ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
Also read: Tax Free Incomes: ఈ 5 రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదని మీకు తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి