Malayalam Veteran actor Mamukkoya Dies in Kozhikode at 77: గత కొంత కాలంగా భారత సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో కృష్ణ, కృష్ణం రాజు, తారకరత్న కన్నుమూశారు. హిందీ, కన్నడలలో కూడా నటులు మృతి చెందారు. తాజాగా మలయాళ నటుడు, కమెడియన్ మముక్కోయ కన్నుమూశారు. ఆయన వయసు 77. కేరళలోని కోజికోడ్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు.  ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిళ్లై ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. మముక్కోయ మృతి పట్ల మలయాళ సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం రాత్రి మలప్పురం జిల్లాలోని వాండూర్‌లో జరిగిన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ కార్యక్రమంలో మలయాళ కమెడియన్ మముక్కోయ పాల్గొన్నారు. టోర్నమెంట్ వేదికపైనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే మముక్కోయను కోజికోడ్‌లో ఓ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించినా.. కోలుకోలేక నేడు మముక్కోయ మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్‌తో పాటు బ్రెయిన్ హెమరేజ్‌తో ఆయన మరణించారని సమాచారం. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. మముక్కోయ చివరిసారిగా సులైఖా మంజిల్‌లో కనిపించారు. ఇది ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


1979లో థియేటర్‌లో మముక్కోయ తన నటనా వృత్తిని ప్రారంభించారు. 1979 అన్యరుడే భూమితో వెండితెరకు పరిచయం అయ్యారు. గాంధీనగర్ 2వ వీధి, సందేశం, నాడోడికట్టు, వడక్కునొక్కియంత్రం, చకోరం, రామ్‌జీ రావు స్పీకింగ్, ఇన్నాతే చింతా మరియు పెరుమఝక్కలం వంటి 400 చిత్రాలలో నటించారు. మముక్కోయ హాస్య మరియు క్యారెక్టర్ పాత్రలలో ఎక్కువగా నటించారు. మలయాళ చిత్రసీమలో అత్యుత్తమ హాస్య నటులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.


మముక్కోయ తన నటనకు గాను రెండు కేరళ రాష్ట్ర అవార్డులను (2004 మరియు 2008) కూడా గెలుచుకున్నారు. ఎక్కువగా కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నటించారు. తెలుగులో డబ్ అయిన దుల్కర్ సల్మాన్ నటించిన 'జనతా హోటల్', మోహన్‌ లాల్ నటించిన 'కనుపాప' చిత్రాల్లో మముక్కోయ కీలక పాత్రలు పోషించారు. జూలై 1946లో జన్మించిన మాముక్కోయ.. 2023 ఏప్రిల్ 26న మరణించారు. ఆయన మృతికి మలయాళ సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. 


Also Read: Tata Nexon Price 2023: బెస్ట్ సెల్లింగ్ కారు టాటా నెక్సాన్‌ను కేవలం 1.5 లక్షలకే ఇంటికి తీసుకుకెళ్లండి!  


Also Read: Virat Kohli IPL Ban: విరాట్‌ కోహ్లీ మెడ మీద వేలాడుతున్న కత్తి.. ఐపీఎల్ బ్యాన్ తప్పదా?   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.