Manchu Family:  మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిందనే వార్తలు దుమారం రేపుతున్నాయి. మోహన్ బాబు తనను కొట్టాడని ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ చెబుతున్నారు. అంతేకాదు  గాయాలతో బంజారాహిల్స్ హాస్పిటల్ కు వచ్చారు. మెడకు పట్టితో ఉన్న మంచు మనోజ్ నడవలేని స్థితిలో భార్యను పట్టుకుని కుంటుతూ హాస్పిటల్ కు వచ్చాడు. మనోజ్ ను ఆ స్థితిలో చూసిన వాళ్లంతా తీవ్రంగా కొట్టారని అభిప్రాయపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఉదయం నుంచి ఈ రచ్చ సాగుతుండగా తాజాగా హీరో మోహన్ బాబు చేసిన ట్వీట్ మరింత చర్చగా మారింది. కోరికలే గుర్రాలతే సినిమాను గుర్తు చేస్తూ పోస్ట్ చేశారు మోహన్ బాబు. దీంతో మనోజ్ గురించే ఈ ట్వీట్ చేశారనే టాక్ వస్తోంది. ఆస్తుల కోసమే గొడవ జరిగిందని ప్రచారం సాగుతుండగా.. మనోజ్ కు ఆశ ఎక్కువైందనే అర్ధం వచ్చేలా మోహన్ బాబు ట్వీట్ చేశారని అంటున్నారు.  మరోవైపు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


మరోవైపు గతంలో కూడా మంచు మనోజ్, మంచు విష్ణు బహిరంగంగానే కొట్టుకున్నారు.  ఆ తర్వాత మోహన్ బాబు రంగంలోకి దిగి వీళ్లిద్దరికి సర్ది చెప్పడంతో అంతా తూచ్ అన్నారు. ఏదో షూటింగ్ కోసం రిహార్సల్స్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మొత్తంగా గత కొన్నేళ్లుగా అన్నాదమ్ముల్ల మధ్య అంత సఖ్యత లేదు. మరోవైపు భూమి మౌనికా రెడ్డిని మంచు మనోజ్ వివాహాం చేసుకోవడాన్ని మోహన్ బాబుతో పాటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అంగీకరించలేదనే వాదనలు ఉన్నాయి. వారి అంగీకరించకపోయినా.. మంచు మనోజ్ .. మౌనికను పెళ్లి చేసుకున్నాడు.  మనోజ్ రెండో పెళ్లి తర్వాత ఆస్తుల విషయమై అన్నతో పాటు తండ్రిని నిలదీసినట్టు తెలుస్తుంది. మరోవైపు భూమా ఫ్యామిలీ కూడా ఆస్తుల విషయంలో తండ్రి, అన్నతో తలపడుతున్న మంచు మనోజ్ కు  అండగా నిలుస్తున్నారు. మొత్తంగా మంచు ఫ్యామిలీలో జరిగుతున్న పరిణామం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. 


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..


ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.