Manchu Lakshmi Twitter Blue Tick సోషల్ మీడియాలో బ్లూ టిక్‌ అనేది అధికారిక గుర్తు. బ్లూ టిక్ ఉన్న ఖాతాల నుంచి ట్వీట్ గానీ, పోస్ట్ గానీ పడితే అధికారికమని అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇలా ఎవరికీ పడితే వారికి బ్లూ టిక్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అందరికీ బ్లూ టిక్ వస్తుంది. డబ్బులు కడితే బ్లూ టిక్ వస్తుంది. నెలకు కొంత చొప్పున చెల్లించకపోతే ఆ బ్లూ టిక్ కనిపించకుండా పోతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద సెలెబ్రిటీలందరికీ బ్లూ టిక్ లేకుండా పోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమితాబ్, చిరంజీవి దగ్గరి నుంచి అందరికీ ఈ బ్లూ టిక్ అనేది మాయమైంది. వారిది కూడా ఓ సాధారణ అకౌంట్‌లానే తయారైంది. ఈ విషయం మీద కుష్బూ నేటి ఉదయం నుంచి కూడా ట్వీట్లు చేస్తూనే ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారు.. నా అకౌంట్ యాక్టివ్‌ అని చూపిస్తోంది.. కానీ ఇలా బ్లూ టిక్ మాయమైంది అంటూ ఇలా తన వాదనను వినిపిస్తూ వస్తోంది.


 



తాజాగా మంచు లక్ష్మీ ఈ బ్లూటిక్ గురించి స్పందించింది. తనకు కూడా బ్లూ టిక్ ఎగిరిపోవడాన్ని నిలదీసింది. నేన బ్లూ టిక్ కోసం డబ్బులు కడతాను.. కానీ దాని వల్ల నాకేం వస్తుంది.. ఎవరైనా నాకు వివరించి చెబుతారా?.. నా పేరు పక్కన కేవలం ఓ బ్లూ టిక్ వచ్చి చేరేతుందా? అందుకే డబ్బులు కట్టాలా? అని ప్రశ్నించింది మంచు లక్ష్మీ.


Also Read:  Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక


ఇక ఇప్పుడు సెలెబ్రిటీలంతా కూడా నెల నెలకు డబ్బు చెల్లించి తమ తమ బ్లూ టిక్‌ను నిలబెట్టుకుంటారా? లేదంటే లైట్ తీసుకుంటారా? అన్నది చూడాలి. ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా ఎంత మంది ఫాలోవర్లతో ఉన్నా కూడా బ్లూ టిక్ అనేది ఇప్పుడు కనిపించడం లేదు. మెల్లిగా ఒక్కొక్కరి ఖాతాకు ఈ బ్లూ టిక్ మాయం అవుతోంది. కుష్బూ అయితే ఈ బ్లూ టిక్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది.


Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook