YS Jagan Troll Video మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురవుతూనే ఉంటుంది. మంచు లక్ష్మీ మాట్లాడే మాటలు, వేసే ట్వీట్లు ట్రోల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా ఆమె వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులకు కోపాన్ని తెప్పించేసింది. ఆమె ఉద్దేశ్యం ట్రోలింగ్ చేయడం కాకపోయినా కూడా జగన్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మంచు లక్ష్మీని దారుణంగా తిట్టేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం వైఎస్ జగన్ ఓసారి ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో అలా దిక్కులు చూసుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ వీడియోను వేరే విషయానికి లింక్ చేస్తూ ఒకతను ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. నేను ఈ రోజు ఎగ్జామ్‌ పేపర్‌ చూసి ఎగ్జామ్ హాల్లో మూడు గంటలు ఇలానే చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై మంచు లక్ష్మీ స్పందించింది. ఫుల్ నవ్వొస్తుంది.. అంటూ మంచు లక్ష్మీ వేసిన ట్వీట్ మీద జగన్ అభిమానులు మండిపడుతున్నారు.


జగన్ అన్నానే ట్రోల్ చేస్తావా. అనవసరంగా చెరదిసాడు జగన్ అన్న మిమ్మల్నీ.. అన్ని మూసుకొని ట్వీట్ డిలీట్ చెయ్. సీఎం మీద ట్రోల్స్ చేస్తున్నావ్ అంటే నీ అంత చిల్లర ఎవ్వరూ ఉండరు. అంతో ఇంతో జగన్ అన్న సపోర్ట్ వుందని మీకు మీ సినిమాలకు రెస్పెక్ట్ వుంది.


ఇన్ని రోజులు వీళ్ళని ఎందుకు పాపం అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు అందరి హీరో ఫ్యాన్స్ అనుకున్న ఇప్పుడు తప్పులేదు అనిపిస్తుంది ..అక్కడ ఏమి జరిగిందో మొత్తం వీడియో చూస్తే తెలుస్తుంది.నీకు ఎంత కడుపులో మంట ఉన్న బాబు మళ్ళీ సీఎం కాలేడు కానీయ్యం అక్కయ్యా..ఇక నుంచి మా ట్రోల్స్ కూడా ఉంటాయి అంటూ ఇలా జనాలు మంచు లక్ష్మీ మీద మండిపడుతున్నారు.


Also Read : HIT 2 Movie Review : హిట్‌ 2 రివ్యూ.. కోడి బుర్ర ఎవరిదంటే?


Also Read : Matti Kusthi Telugu Movie Review : మట్టి కుస్తీ రివ్యూ.. సరదాగా సాగే భార్యాభర్తల పోటీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook