Manchu Manoj Mirai: మిరాయి నుంచి వచ్చేసిన మంచు మనోజ్ టీజర్.. అదరగొట్టిన హీరో
Mirai Teaser Out: హనుమ్యాన్ తో బ్లాక్ బస్టర్ సాధించిన యువ హీరో తేజ సజ్జ ఇప్పుడు మిరాయి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు. తాజాగా మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఇవాళ మనోజ్ పాత్రికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Mirai Balck Sword Teaser: హను మ్యాన్ సినిమా తోనే బ్లాక్ బస్టర్ అందుకున్న యువ హీరో తేజ తాజా ఇప్పుడు నిరాయి అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తేజ సజ్జ ఈ సినిమాలో ఒక సూపర్ యోధుడిగా కనిపించనున్నారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయని చెప్పుకోవచ్చు.
మరోవైపు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నా మంచు మనోజ్ కూడా ఈ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆసక్తికరమైన ఆ విషయం ఏమిటంటే ఈ సినిమాలో మంచు మనోజ్ ఒక నెగిటివ్ పాత్ర పోషిస్తున్నారు. దీంతో సినిమాకి మరింత క్రేజ్ పెరిగిపోయింది.
తాజాగా ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల ఐ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక పవర్ ఫుల్ ఖడ్గంతో మంచు మనోజ్ మాంత్రికుడిలా కనిపించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్రకి సంబంధించిన టీజర్ విడుదలై అందరు దృష్టిని ఆకర్షిస్తుంది.
బ్లాక్ స్వార్డ్ (నల్ల ఖడ్గం) అనేది ప్రపంచంలోనే డేంజరస్ ఆయుధం అని హింట్ ఇచ్చిన చిత్ర బృందం మంచు మనోజ్ ఆ ఖడ్గాన్ని వాడుతున్నట్లు అదిరిపోయే విజువల్స్ తో చూపించారు. చాలాకాలం తర్వాత వెండితెర మీద కనిపించనున్న మంచు మనోజ్ ఈ సినిమాలో నెగిటివ్ పాత్ర అయినప్పటికీ చాలా స్టైలిష్ గా కనిపిస్తూ అందరిని ఇంప్రెస్ చేస్తున్నారు. పొడుగు జుట్టు, సన్ గ్లాసెస్ తో మంచు మనోజ్ అందరినీ ఆకట్టుకున్నారు.
ఇక సినిమాలో మనోజ్ పాత్ర ఎలా ఉండబోతోంది అని సర్వత్ర ఆసక్తి నెలకొంది. తాజాగా ఇవాళ మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఈ వేసవిలో విడుదల కాబోతోంది. 2025 ఏప్రిల్ 18 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధం అవుతుంది.
ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Also Read: EC Action: ఎన్నికల్లో హింసపై ఎన్నికల సంఘం కొరడా.. పోలీసులు, అధికారులపై తీవ్ర చర్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter