Manchu Family Rude Behavior: మీడియాతో మనోజ్ వెటకారం.. ఎదురుదాడి చేసిన మోహన్ బాబు.. తేడా ఫ్యామిలీ అంటున్న జనాలు
Manchu Manoj with Media: మంచు మనోజ్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. తిరుపతిలో ప్రత్యక్షమైన మంచు మనోజ్ మీడియాతో వెటకారంగా మాట్లాడాడు. రీసెంట్ ఇష్యూ గురించి రియాక్ట్ అవ్వమని మీడియా ప్రతినిధి అడిగితే.. వెటకారంగా సమాధానం చెప్పి వెళ్లిపోయాడు.
Manchu Manoj and Mohanbabu Rude Behavior with Media గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. మంచు వారింట్లో నిజంగానే గొడవలు జరిగాయా? దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకుంటోందా? మధ్యలో రియాల్టీ షో అని మంచు విష్ణు ప్లేట్ పిరాయించడం, మోహన్ బాబు సైతం అందులో సూత్రధారి అని వార్తలు రావడం అందరికీ తెలిసిందే. ఇక అందరూ ఒక సైడ్ అంటే.. మంచు మనోజ్ మాత్రం ఇంకో సైడ్ ఉంటున్నాడనేది స్పష్టంగా అర్థమవుతోంది.
అయితే ఆ సారథి కథ ఏంటో.. మధ్యలో విష్ణు, మనోజ్ గొడవ పడిన విషయాలు ఏంటో? మోహన్ బాబు స్పందించి.. అన్నదమ్ములు అన్నాక.. గొడవలు సహజం అని చెప్పడం ఎందుకో.. ఆ గొడవలు ఏంటో బయటకు చెప్పకపోవడం ఏంటో వారికే తెలియాలి. హౌస్ ఆఫ్ మంచు అంటూ ఓ వీడియోను మంచు విష్ణు వదలడం ఏంటో.. అందులో మళ్లీ విష్ణు, మోహన్ బాబు మాత్రమే కనిపించడం ఏంటో ఎవ్వరికీ అంతు పట్టడం లేదు.
అయితే తిరుపతిలో మోహన్ బాబు, మంచు మనోజ్ కనిపించడంతో మీడియా వారిని రీసెంట్‌గా జరిగిన ఇష్యూల మీద స్పందించమని కోరింది. దీనికి మంచు మనోజ్ వెకిలి సమాధానం అందరికీ కాలిపోయేలా అనిపించింది. రీసెంట్‌గా అంటే.. నాకు సెగ గడ్డ వచ్చింది.. వచ్చి గోకుతారా? అదే నా రీసెంట్ సమస్య అని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.
Also Read: Padma Awards 2023 : గర్వంగా ఉంది పెద్దన్న.. కీరవాణిపై రాజమౌళి ట్వీట్
మోహన్ బాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి మీడియా మీద ఎదురుదాడి చేశాడు. నీ ఇంట్లో నీ భార్యకు, నీకు సంబంధం ఏంటో చెప్పగలవా? తప్పయ్యా.. చదువుకున్న విజ్ఞానులు మీరు.. మీరంతా నాకిష్టం.. ఎప్పుడు ఏది అడగాలో అది అడగాలి.. సమయం, సందర్భం చూడాలి.. నేను వచ్చిన పని ఏంటి.. హాస్పిటల్ ఓపెనింగ్.. ఇది అత్యద్భుతంగా ఉండాలి.. డాక్టర్లు మంచివారున్నారు అని చెప్పి వెళ్లిపోయాడు.
Also Read: Samantha Ruth Prabhu : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అతడికి ఐలవ్యూ చెప్పిన సమంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook