Samantha Ruth Prabhu: నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా..? అతడికి I LOVE YOU చెప్పిన సమంత!

Samantha Ruth Prabhu Ignores Naga Chaitanya: సమంత తన విడాకుల తరువాత ఎక్కడా కూడా నాగ చైతన్యకు సంబంధించిన ఫోటోలు గానీ, పోస్టులు గానీ వేయలేదు. అసలు నాగ చైతన్య పేరు కూడా ఎత్తడానికి ఆమె ఇష్టపడటం లేదనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2023, 10:57 AM IST
  • నెట్టింట్లో మజిలీపై చర్చలు
  • ఎమోషనల్ అయిన సమంత
  • పట్టించుకోని నాగ చైతన్య
Samantha Ruth Prabhu: నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా..? అతడికి I LOVE YOU చెప్పిన సమంత!

Samantha Ruth Prabhu Said I love you to Director Shiva Nirvana: మజిలీ సినిమాలో శ్రావణిగా సమంత, పూర్ణ పాత్రలో నాగ చైతన్య అదరగొట్టేశారు. భార్య అంటే శ్రావణిలా ఉండాలని అంతా అనుకున్నారు. ఇలాంటి జంట బయట ఉంటుందా? అని అంతా అనుకున్నారు. రియల్ లైఫ్‌లోనూ సమంత, నాగ చైతన్య భార్యాభర్తలు కావడం, స్క్రీన్ మీద ఆ కెమిస్ట్రీ సెట్ అవ్వడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ చై సామ్ పర్సనల్ కెరీర్ మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది.

సమంత, నాగ చైతన్యలు నాలుగేళ్లు వివాహా బంధంలో బాగానే ఉన్నారు. కానీ ఏమైందో తెలియదు గానీ రెండేళ్ల క్రితం వీరు విడిపోయారు. అయితే విడిపోయిన తరువాత నాగ చైతన్యను పూర్తిగా దూరం పెట్టేసింది సమంత. విడిపోతున్నామని చెబుతూ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్‌లో ఇలా ఉంది. తామిద్దరం వ్యక్తిగతంగా విడిపోయినా, వృత్తిపరంగా స్నేహితులుగానే ఉంటామని చెప్పారు. కానీ సమంత మాత్రం నాగ చైతన్యను పూర్తిగా దూరం పెట్టేసింది.

నాగ చైతన్య బర్త్ డేలకు అస్సలు విష్ చేయదు. ఆయన సినిమాలున్నా కూడా విష్ చేయదు. కానీ అఖిల్, సుశాంత్, సుమంత్, వెంకీమామ కూతురు, రానాలతో ఇలా అందరితో బాగానే ఉంటుంది. కానీ నాగార్జున, నాగ చైతన్యలతో మాత్రం సమంత మాట్లాడుతున్నట్టుగా కనిపించడం లేదు. నాగ చైతన్య బర్త్ డేకు స్పందించకపోయినా ఆశ్చర్యపడని జనాలు.. ఏమాయ చేశావే, మజిలీ సినిమాల గురించి చెబుతూ కనీసం నాగ చైతన్య పేరుని గానీ, పోస్టర్‌ను గానీ ఎక్కడా షేర్ చేయదు.

Also Read:  Devi Sri Prasad Marriage : ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. ఎంత ఏజ్ గ్యాప్ అంటే?

తాజాగా మజిలీకి నాలుగేళ్లు పూర్తయ్యాయి అంటూ సమంత వేసిన పోస్ట్‌లోనూ చైతూ ప్రస్థావన లేదు. కానీ డైరెక్టర్ శివ నిర్వాణకు మాత్రం ప్రత్యేకంగా ఐ లవ్యూ చెప్పింది. శ్రావణి లాంటి మంచి పాత్రను ఇచ్చినందుకు థాంక్స్ అని చెప్పింది. ఇప్పుడు ఖుషి సినిమాలో ఆరాధ్య పాత్రను ఇచ్చారని చెప్పింది. లవ్యూ సామ్ గారు.. మీరు ది బెస్ట్ అని శివ నిర్వాణ రిప్లై ఇచ్చాడు.

నాగ చైతన్య శోభిత డేటింగ్‌ల మీద సమంత స్పందించినట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని చూసి తెలుగు మీడియా సైతం కుమ్మేసింది. అయితే తానేమీ అలా అనలేదంటూ సమంత క్లారిటీ ఇవ్వడంతో అందరూ డైలామాలో పడ్డారు. అసలు చైతూ శోభితల డేటింగ్‌ కథ ఏంటి? పెళ్లి వరకు వ్యవహారం వెళ్తుందా? అన్నది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు.

Also Read: Samantha Ruth Prabhu: ఎవరు ఎవరితో చేసుకున్నా నాకేం బాధలేదు!.. నాగ చైతన్య - శోభిత డేటింగ్‌పై సమంత రియాక్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News