Manchu Manoj Tweet About Second Marriage: మంచు మనోజ్ మీద గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్ అందరికీ తెలిసిందే. భూమా మౌనిక రెడ్డితో డేటింగ్ చేస్తున్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా మంచు మనోజ్ అందరినీ ఆశ్చర్యపరిచే ట్వీట్ వేశాడు. ఎన్నో రోజుల నుంచి ఈ శుభవార్తను చెప్పాలని వెయిట్ చేస్తున్నాను.. మొత్తానికి ఆ సమయం వచ్చింది.. జనవరి 20న ఆ శుభవార్తను అందరికీ చెబుతాను అంటూ ట్వీట్ వేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మంచు మనోజ్ వేసిన ఈ ట్వీట్ రెండో పెళ్లి గురించా..? లేదంటే కొత్త సినిమా గురించా..? అన్నది తెలియడం లేదు. అయితే చాలా మంది మాత్రం ఈ ట్వీట్ రెండో పెళ్లి గురించి అని అంటున్నారు. మన్మథ మన్మథ రాజా అనే సాంగ్‌ జిఫ్ ఫైల్‌ను షేర్ చేయడంతో ఇది కచ్చితంగా సినిమా ప్రకటన గురించే అని అంటున్నారు.




ఇన్ స్టాగ్రాంలో అయితే సింగిల్‌గా ఉన్న సింహం బొమ్మను షేర్ చేశాడు. మరి ఇలా ఏ విషయం మీదా క్లారిటీ ఇవ్వకుండా ట్వీట్ వేశాడు. కావాలనే ఇలా చేసినట్టుగా, ఇలా ట్వీట్ చేస్తేనే జనాల్లోకి బాగా ఎక్కుతుందని, కొత్త సినిమానా..? రెండో పెళ్లి గురించా..? అని ఆలోచిస్తూ ఉంటారనే మంచు మనోజ్ ఇలా ట్వీట్ వేసినట్టుగా కనిపిస్తోంది.


మంచు మనోజ్ కరోనా ప్రారంభంలో అహం బ్రహ్మాస్మి అనే సినిమాను ప్రారంభించాడు. ఈ ఈవెంట్‌కు రామ్ చరణ్‌ గెస్టుగా వచ్చాడు. పాన్ ఇండియన్ లెవెల్లో రావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల మధ్యలోనే ఆగినట్టు తెలుస్తోంది. ఇక మంచు మనోజ్ మొదటి పెళ్లి, విడాకుల వ్యవహారం అందరికీ తెలిసిందే.


Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?


Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook