Venkatesh Anil Ravipudi Movie: మంచు కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో మంచు మనోజ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మంచు మనోజ్.. గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. కాగా కొద్దికాలం నుండి కెమెరాకి కూడా దూరంగా ఉన్న మనోజ్  మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వనన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న మిరాయి అనే పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలో.. ముఖ్య విలన్ పాత్రలో కనిపించనున్నారు మనోజ్. తాజాగా మనోజ్ పాత్రికి సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 


ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ.. అప్పుడే మంచు మనోజ్ మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ఎఫ్2, ఎఫ్3 వంటి సూపర్ హిట్ సినిమాలు తర్వాత సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మరొక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. 


తాజా సమాచారం ప్రకారం మంచు మనోజ్ ఈ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మొన్న మంచు మనోస్ పుట్టినరోజు సందర్భంగా అనిల్ రవిపూడి శుభాకాంక్షలు తెలుపగా, దానికి మంచు మనోజ్ ‘మన కాంబినేషన్ సినిమాతో దుమ్ము లేపుదాం’.. అంటూ రిప్లై ఇచ్చారు. 


ఇప్పట్లో మంచు మనోజ్, అనిల్ రావిపూడి కాంబో సినిమా కుదిరేది కాదు. కాబట్టి మంచు మనోజ్ కచ్చితంగా వెంకటేష్ సినిమాలోని నటిస్తున్నారు అని పుకార్లు మొదలయ్యాయి. పోలీస్ ఆఫీసర్ బ్యాక్ డ్రాప్ లో మాజీ ప్రియురాలు భర్త మధ్య జరిగే ఒక యాక్షన్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కనుంది. 


ప్రస్తుతం రానా నాయుడు సీజన్ 2 తో బిజీగా ఉన్నా వెంకటేష్ చాలావరకు సమయాన్ని ముంబైలోనే గడపాల్సి వస్తోంది. అయితే వెంకీ తరచుగా హైదరాబాద్ వస్తున్నారు కానీ.. ప్రస్తుతం రానా నాయుడు కోసం వెంకీ ఉన్న లుక్.. అనిల్ రావిపూడి సినిమా కి సెట్ అవదు. కాబట్టి అనిల్ రావిపూడి రానా నాయుడు షూటింగ్ పూర్తయ్యేదాకా ఎదురు చూడాల్సిందే. 


అన్నీ అనుకూలిస్తే సినిమా జులై లేదా ఆగస్టులో మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేశారు. లొకేషన్ లు కూడా సెట్ అయిపోయాయి. కాబట్టి త్వరగానే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.


Also Read: AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు ఇవేనా.. పందెం రాయుల్ల బెట్టింగ్ ఇదే..


Also Read: PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter