AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 25 లోక్‌సభ సీట్లతో పాటు 175 అసంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. తెలుగుదేశం, బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 6 లోక్ సభ సీట్లతో పాటు 10 స్థానాల్లో కూటమి తరుపున బరిలో దిగింది. ఈ ఎన్నికల్లో క్యాంపెన్ జరిగిపుడు ఒకటి.. ఓటింగ్ జరిగినపుడు మరొక విశ్లేషణ బయటకు వచ్చింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట, తిరుపతి స్థానాల్లో ఎంపీగా కూటమి తరుపున బరిలో దిగింది. ఎన్నికల్లో ప్రజలు సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనే డౌట్స్ కు చెక్ పడింది. చాలా చోట్ల ముగ్గురు ప్రధాన పార్టీల ఓటర్లు తమ ఓట్లను 60 శాతం వరకు బదలాయించినట్టు తెలుస్తోంది.
ఇందులో పార్లమెంట్ స్థానాల విషయానికొస్తే.. నర్సాపురం, అనకాపల్లి స్థానాల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందనే చాలా మంది పందెం రాయుళ్లు పందెం కాస్తున్నారు. కొన్ని సర్వేల్లో రాజమండ్రిలో బీజేపీ వర్సెస్ వైసీపీ మధ్య తీవ్ర పోటీ ఉందని చెబుతున్నారు. ఇందులో బీజేపీ అతి తక్కువ మెజారిటీతో బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. మరోవైపు రాజంపేటలో వైసీపీకి పూర్తి పట్టుంది. అక్కడ మిథున్ రెడ్డి ఎంపీగా పోటీ చేసారు. మరోవైపు బీజేపీ తరుపున మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బలమైన అభ్యర్ధిగా గట్టిపోటీ ఇచ్చారు. ఈ సీటులో ఎక్కువగా వైసీపీకి అనుకూలంగా ఓట్లు పోలైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పందెం రాయుళ్లు ఇక్కడు వైసీపీ గెలుస్తుందని పందెం కాసినట్టు చెబుతున్నారు. అటు తిరుపతి పార్లమెంట్ సీటులో వైసీపీకే ఎక్కువ అవకాశాలున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు అరకు లోక్‌సభ సీటు విషయంలో ఇక్కడ బీజేపీ కంటే వైసీపీకే ఎక్కువ అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఏపీలో జరిగిన పార్లమెంట్ సీట్లలో బీజేపీ 2 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజమండ్రిలో నువ్వానేనా అన్నట్టుగా పోటీ ఉంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే అదనంగా ఈ సీటు తప్పించి మిగిలిన మూడు సీట్లలో అసలు బీజేపీ గెలిచే అవకాశాలే లేవని అందరు చెప్పుకుంటున్నారు. పందెం రాయళ్లు కూడా ఈ మూడు సీట్లపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.
అటు ఏపీలో విశాఖ పట్నం సిటీ నుంచి విష్ణుకుమార్ రాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, విజయవాడ పశ్చిమం నుంచి గెలిచే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ మూడు సీట్లపై పందెం రాయళ్లు ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. మొత్తంగా 3 పార్లమెంట్ సీట్లతో పాటు మూడు అసెంబ్లీ సీట్లు బీజేపీ ఖచ్చితంగా గెలిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఆ సర్వేలతో పాటు యూత్ చాలా మంది బీజేపీవైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అటు మోదీ ఫ్యాక్టర్.. విజయవాడలో చంద్రబాబు, పవన్‌లతో నరేంద్ర మోదీ రోడ్ షో కూటమికి బాగా ఊపు తీసుకొచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also read: Summer Tourism Tips: వేసవిలో ఈ 6 పర్యాటక ప్రాంతాల సందర్శన నరకమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు ఇవేనా.. పందెం రాయుల్ల బెట్టింగ్ ఇదే..