PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

PK on YS Jagan: ప్రశాంత్ కిషోర్ మరోసారి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీలో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి బీజేపీ, టీడీపీ, జనసేక కూటమి కంటే ఎక్కువ సీట్లు వస్తే ప్రజలు నా మొఖం మీద పేడ కొడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధానత్య సంతరించుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 21, 2024, 09:18 AM IST
PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

PK on YS Jagan: ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ నెల 13న ఎన్నికల ముగిసాయి. ఏపీలో 25 లోక్‌సభ సీట్లతో పాటు  175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం, జనసేన ఓ కూటమిగా 175 సీట్లతో పాటు 25 అసెంబ్లీ సీట్లకు పోటీ చేశాయి. అటు అధికార వైయస్‌ఆర్సీపీ మొత్తం 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ సీట్లకు ఒంటరిగానే బరిలో దిగింది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే మూడో కూటమిగా ఎన్నికల్లో తన లక్‌ పరీక్షించుకుంది. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ చెప్పినట్టుగా వైయస్ఆర్సీపీకి 151 కంటే ఎక్కువ శాసనసభ స్థానాలొస్తే తన ముఖాని పేడ కొడతారని చెప్పుకొచ్చారు. లేదంటే ఆయనకే అది జరగుతుందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. రీసెంట్‌గా విజయవాడ ఐ - ప్యాక్ ఆఫీసుకు వెళ్లిన జగన్.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రభావమేమి ఎన్నికల్లో లేదంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే కదా. ఐప్యాక్ హెడ్ రుషిరాజ్ నేతృత్వంలోని టీమ్  మెంబర్స్ వైసీపీ కోసం ఎన్నికల్లో కష్టపడినట్టు తెలిపారు. ఏపీలో ఫలితాలపై ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ స్పందించారు.
 
అంతేకాదు జూన్ 4న వెలబడే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోనున్నట్లు మరోసారి బల్లగుద్ది బరి చెప్పారు. బీజేపీ,టీడీపీ, జనసేన కూటమే అధికారంలోకి రాబోతుందని చెప్పుకొచ్చారు. దేశంలో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో కేంద్రంలో కొత్త ఎన్టీయే సర్కారు కొలువు తీరనున్నట్టు చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ తామే అధికారంలోకి రాబోతున్నట్టు చెబుతున్నారు. వారి లాగే జగన్ కూడా తామే అధికారంలోకి వస్తామనే భ్రమల్లో ఉన్నారని చెప్పారు. కేవలం సంక్షేమ పథకాలతో ప్రభుత్వాలు ఏర్పడటం ఇంపాజిబుల్ అన్నారు.

Also read: Summer Tourism Tips: వేసవిలో ఈ 6 పర్యాటక ప్రాంతాల సందర్శన నరకమే

Trending News