Rigging in MAA Elections: టాలీవుడ్‌లో మా ఎన్నికల హోరు నడుస్తోంది. ప్రతిష్టాత్మక మా ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో టెన్షన్ నెలకొంది. కాస్సేపు నిలిచిన పోలింగ్, రిగ్గింగ్ ఆరోపణల మధ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల(MAA Elections Polling)పోలింగ్ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున్నారంటూ ఒకరికొకరు ఆరోపణలు సంధించుకుంటున్నారు. ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు మంచు విష్ణు. మా అసోసియేషన్ ఎన్నికల పోలింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని మంచు విష్ణు సంచలన ఆరోపణలు చేశారు. బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లి గుద్దారని ఆరోపించారు. అయితే గుద్దింది ఎవరికనేది తెలియదని చెప్పారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించేందుకే బ్రహ్మానందం గట్టిగా అరిచారన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. మంచు విష్ణు ఆరోపణల నేపధ్యంలో ఎన్నికలు కాస్సేపు నిలిచిపోయాయి. ఎన్నికల అధికారులు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు(Manchu Vishnu) ప్యానెల్ సభ్యుల్ని పిలిపించారు. రెండు బృందాలతో చర్చించి..రిగ్గింగ్ జరిగినట్టు తేలితే ఫలితాలు ప్రకటించకుండా కోర్టుకు వెళ్తామని చెప్పారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మొత్తంత 883 ఓట్లు కాగా ఇప్పటి వరకూ 30 శాతం పోలింగ్ నమోదైంది.


Also read: MAA Elections Polling: ఇలాంటి ఎన్నికల్ని ఎన్నడూ చూడలేదంటున్న పవన్ కళ్యాణ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook