Mohan Babu Apologised To Journalist: కుటుంబ వివాదం నేపథ్యంలో జరిగిన గొడవల్లో ఓ జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ అంశంలో పోలీసులు తీవ్రంగా పరిగణించి అరెస్ట్‌కు సిద్ధమైన వేళ మోహన్ బాబు దిగివచ్చాడు. ఎట్టకేలకు బాధితుడికి క్షమాపణ చెప్పాడు. ఈ వ్యవహారం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Manchu Manoj vs Vishnu: మంచు మనోజ్ కథ కొద్ది రోజులగా తన అన్న విష్ణు పైన మంది పడుతున్న తీరు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం మనోజ్.. విష్ణు పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. తన తల్లి, కూతురు ఇంట్లో ఉండగానే.. వారి ప్రాణానికే ముప్పు కలిగించే ప్రయత్నాలు విష్ణు చేశారు అంటూ మనోజ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
Manchu Vishnu Comments on Controversy: గొడవల కారణంగా తాను కన్నప్ప షూటింగ్‌ను ఆపేసి ఇక్కడికి వచ్చానని మంచు విష్ణు తెలిపారు. అన్ని కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి.. ఉమ్మడి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయన్నారు.
Case Filed On Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మోహన్‌బాబుకు బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మోహన్‌బాబు బీపీ ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రిలో చేరారు. నిన్న మీడియా ప్రతినిధిపై కూడా చేయి చేసుకున్నారు మోహన్ బాబు అది కాస్త వివాదాస్పదమైన సంగతి తెలిసిందే..
Manchu Family - Vinay Maheshwari: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ పరువు బజారున పడింది. అంతేకాదు వీధికెక్కి తండ్రీ కొడుకులు.. అన్నాదమ్ములు బాహాబాహీకి దిగుతున్నారు. అంతేకాదు ఒకరి బౌన్సర్లతో మరొకరు బౌన్సర్లు పెద్ద యుద్దమే చేసారు. ఈ రచ్చలో ఇపుడు అందరికి వినిపిస్తూన్న పేరు వినయ్ మహేశ్వరి. ఇంతకీ ఈయన ఎవరు.. ? మంచు ఫ్యామిలీ యుద్దంలో ఈయన పాత్ర ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.
Manoj Vs Vishnu : ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు.. మంచు కుటుంబంలో విభేదాలతో వాళ్ల ఫ్యామిలీ పరువు రచ్చ కెక్కింది. క్రమశిక్షకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు ఫ్యామిలీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా లావాలా విరజిమ్మాయి. అంతేకాదు తండ్రీ కొడుకులైన మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే పరిస్థితికి వచ్చాయి. తాజాగా మంచు విష్ణు తాజాగా ఎంట్రీ ఇవ్వడంతో మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది.
Mohan Babu vs Manchu Manoj: గత రెండు రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య గొడవలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే పరస్పర పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Manchu Vishnu vs Manchu Manoj: ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జల్ పల్లి లోని మోహన్ బాబు నివాసంకి.. పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. మరోపక్క వారికి పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తీసుకొచ్చారని సమాచారం.
అయితే మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలికి సెక్యూరిటీ అనుమతించలేదు. ఈ క్రమంలో కాసేపట్లో దుబాయ్ నుంచి మంచు విష్ణు రానున్నారని.. విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Kannappa Release Date: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ప్యాన్ ఇండియా లెవల్లో అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ కు పోస్ట్ పోన్ చేశారు.
Mohan Babu: తాజాగా ఏపీలో విజయవాడలో సంభవించి వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. అంతేకాదు చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్టు గా తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతు ఆర్ధిక సాయం అందించారు. ఈ కోవలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చెక్ ను అందజేసారు.
Clashes In Manchu Family: మంచు కుటుంబం రెండుగా చీలినట్టు కనిపిస్తోంది. మంచు మనోజ్‌తో తండ్రి మోహన్ బాబుకు తీవ్రస్థాయిలో విబేధాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
Manchu Vishnu : మలయాళీ ఇండస్ట్రీలో హేమా కమిటీ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఇలాంటి కమిటీని తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఏర్పాటు చేయాలి అని మంచు విష్ణు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఈ హీరో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
Avram Manchu: మంచు విష్ణు కి కన్నప్ప సినిమా పైన ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో కష్టపడి మంచి ఫ్యామిలీ ఈ సినిమాని తెరకెక్కిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ కంటెంట్.. ప్రేక్షకులకు ఈ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన మంచి విష్ణు కొడుకు అవ్రామ్ భక్త మంచు ఫస్ట్ లుక్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది.
Kannappa as Manchu Avram: మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ 'కన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ప్యాన్ ఇండియా లెవల్లో అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి ప్యాన్ ఇండియా యాక్టర్స్ నటిస్తుండటంతో ఈ సినిమా అంచనాలు పీక్స్‌ను మించి పోయాయి. ఇప్పటికే ప్రతి సోమవారం ఈ సినిమా నుంచి పూటకో అప్ డేట్ ఇస్తున్నా మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.
Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో..నటి హేమకు ఇటీవల చేసిన అనేక టెస్టులలో డ్రగ్ నెగెటివ్ రిపోర్టు వచ్చిన విషయంను వెల్లడించారు.
Kannappa Update: మంచు ఫ్యామిలీ వారి మనస్సు కూడా మంచు.. లానే ఉంటది. అందుకు ఉదాహరణ.. వారు ఇతరులకు చేసే సహాయం. మోహన్ బాబు.. తిరుపతిలో ఉందే తన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా.. ఎంతోమంది పేద పిల్లలకు సైతం ఫ్రీగా చదివిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రూట్ ఫాలో అవుతూ.. మంచు విష్ణు కూడా ఎంతోమందికి తన వంతు సహాయం చేస్తూ వస్తున్నారు.
Kannappa: మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తోన్న సినిమా ‘కన్నప్ప’. ఈ సినిమా విజయం అనేది మంచు విష్ణుకు కీలకం అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈ యేడాది చివర్లో డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. ఈ రిలీజ్ డేట్ వెనక ఉన్న స్ట్రాటజీ అదేనా.. ? అని సినీ ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు.
Manchu Brothers: మంచు కుటుంబంలో విభేదాలు మరోసారి బహిరంగంగా బయటపడ్డాయి. ఆ మధ్య వీళ్లిద్దరు బహింరంగంగా బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే కదా. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత మరోసారి మంచు సోదరులు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా త మధ్య విభేదాలను బయటపెట్టుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.