MAA Elections Polling: ప్రతిష్టాత్మక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇలాంటి ఎన్నికల్ని ఎన్నడూ చూడలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ప్రకాశ్‌రాజ్(Prakash Raj) వర్సెస్ మంచు విష్ణు పోటీ ప్రారంభమైపోయింది. నువ్వా నేనా రీతిలో సాగిన ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, రఘుబాబు తదితరులు ఓటుహక్కు ఉపయోగించుకున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికల్ని చూడలేదని సినీ నటుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. తిప్పికొడితే 9 వందలు కూడా లేని ఓట్ల కోసం ఇంతటి వ్యక్తిగత దూషణలు అవసరమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.చిరంజీవి(Chiranjeevi), మోహన్ బాబులిద్దరూ మంచి స్నేహితులని చెప్పారు. మా ఎన్నికల పోలింగ్ జరుగుతున్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు సినిమా ప్రముఖులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉన్న మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లు ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. అక్కడే ఉన్న మోహన్ బాబును చూసి ప్రకాశ్‌రాజ్..కాళ్లకు నమస్కారం చేసేందుకు ప్రయత్నించగా మోహన్ బాబు(Mohan Babu)వారించి భుజం తట్టారు. మా ఎన్నికల్లో 883 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
మా ఎన్నికల(MAA Elections)సందర్భంగా గత ఆరు వారాల నుంచి హోరాహోరీ ప్రచారం, విమర్శ-ప్రతి విమర్శలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. మా గుర్తింపు కార్డు ఉన్నవారికే ఓటేసేందుకు అనుమతి ఉంటుంది. జూబ్లీహిల్స్ స్కూల్ ప్రధాన గేటు వద్ద పోలీసులు, ప్యానెల్ ఏజెంట్లు గుర్తింపు కార్డుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అనుమతిస్తున్నారు.
Also read : BiggBoss Telugu5: శ్రీరామ్‌కు హమీద వద్దంటా..బిగ్‌బాస్ టైటిల్ కావాలట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook