Vennela Kishore 2000 Notes Tweet మంచు విష్ణు తాజాగా ఓ ట్వీటేసి వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. రెండు వేల నోట్లు బ్యాన్ అని ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మంచు విష్ణు ఓ ట్వీట్ వేశాడు. అందులో వెన్నెల కిషోర్ గురించి చెప్పాడు. వెన్నెల కిషోర్ ఇంట్లోకి వెళ్లా.. ఇలా కట్టలుకట్టలుగా రెండు వేల నోట్లు కనిపిస్తున్నాయ్ అంటూ ఫోటోను షేర్ చేశాడు. అయితే అది జోక్ చేశాడని అందరికీ అర్థం అవుతూనే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ కొంత మంది మాత్రం ఆ మ్యాటర్‌ను సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. వెన్నెల కిషోర్ ఇంట్లో నిజంగానే నోట్ల కుప్పులున్నాయని అంతా అనుకున్నారు. దీనిపై తాజాగా మంచు విష్ణు స్పందించాడు. అసలు విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పుకొచ్చాడు. ఇది జోక్ అని చెప్పకనే చెప్పేశాడు.


 



కొంత మంది మీడియా వ్యక్తులు నేను వెన్నెల కిషోర్ మీద వేసిన జోక్‌ను డిఫరెంట్‌గా తీసుకున్నారు.. అది జోక్ అని, ఫన్నీగా వేసిందని అందరికీ తెలుసు.. కూసింత కళాపోషణ ఉన్న వారెవ్వరికైనా అది జోక్ అని అర్థం అవుతుంది.. అది జోక్ అని అర్థం కాని వాళ్లని, అర్థం చేసుకోని వాళ్లని ఆ దేవుడే కాపాడాలి అంటూ విష్ణు క్లారిటీ ఇచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి జిన్నా సినిమాలో చివరగా కలిసి నటించిన సంగతి తెలిసిందే.


Also Read:  Ram Charan Speech : నందమూరి అభిమానుల మనసు గెలిచిన రామ్ చరణ్.. ఎన్టీఆర్‌పై స్పీచ్ అదుర్స్


మంచు విష్ణు జిన్నా సినిమాలో వెన్నెల కిషోర్‌తో కలిసి చేసిన కామెడీ అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి కాంబో బాగానే సెట్ అయినా సినిమా మాత్రం అంతగా క్లిక్ అవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వెన్నెల కిషోర్‌ను మంచు విష్ణు ఎలా ఆడుకున్న సంగతి తెలిసిందే. వెన్నెల కిషోర్‌ని తిడుతూ ఉన్నట్టుగానే ఉన్నా కూడా సెట్‌లో ఎంత సరదగా కలిసి ఉన్నారో చెబుతూ వీడియోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే.


Also Read:  Anasuya Bikini Pics : మొదటి సారిగా బికినీలో అనసూయ.. ఫ్యామిలీ ఫ్యామిలీ మునిగిందిగా?.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook