Vishnu Comments on Chiranjeevi: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఉత్కంఠ రేపిన 'మా' ఎన్నికలు ఫలితాలలో మంచు విష్ణు విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్ మరియు మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్ పరస్పర ఆరోపణలు.. రాజకీయ ఎన్నికలు తలపించిన విషయం తెలిసిందే!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల ఫలితాల అనంతరం.. అధ్యక్షుడిగా గెలిచిన తరువాత మంచు విష్ణు ప్రెస్ మీరు లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు "చెప్పకూడదు అంటూనే... చిరంజీవి, చరణ్ ఇద్దరి సపోర్ట్ ప్రకాష్ రాజ్ గారికే అంటూ కామెంట్స్ చేసారు. " ప్రచారం, ఎన్నికలు అని అయిపోయాయి కాబట్టి, చెప్తున్నా ఆంటూ" చిరంజీవి అంకులు గారు నన్ను ఎన్నికల్లో నుండి తప్పుకోండని మా నాన్న గారిని రిక్వెస్ట్ చేశారు. 


Also Read: Huzurabad bypolls: ఈటల రాజేందర్‌పై కేసు నమోదు.. వేడెక్కుతున్న హుజూరాబాద్ రాజకీయం


"ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నాడు కావున అతడినే ఏకగ్రీవం చేద్దాం అని అడిగారు.. కావున విష్ణుని నామినేషన్ వెనక్కి తీసుకోమని అడిగారు. కానీ మేము ఒప్పుకోలేని కారణంగా ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని" మంచు విష్ణు ప్రెస్ ముందు చెప్పారు. 


"చిరంజీవి అంకుల్ మరియు రామ్ చరణ్ ఇద్దరి ఓటు ప్రకాష్ రాజ్ గారికే వెళ్ళింది. 99 శాతం చెప్పగలను వారి సపోర్ట్ ఆయనకే అని.. చరణ్ నాకు మంచి ఫ్రెండ్, చరణ్ తండ్రి మాట వింటారు. తండ్రి అంటే అంత ఇష్టం చరణ్ కు. ఒకవేళ అదే స్థానంలో నేను ఉన్నా అలానే చేస్తా కావచ్చు. చిరంజీవి అంకులు ఇంటికి వెళ్లి వారి ఆశీస్సులు తప్పక తీసుకుంటా" అని మంచి విష్ణు తెలిపారు.


Also Read: Mohan Babu press meet: నన్ను రెచ్చగొట్టాలని చూశారు.. MAA Elections పై మోహన్ బాబు స్పందన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook