Huzurabad bypolls: ఈటల రాజేందర్‌పై కేసు నమోదు.. వేడెక్కుతున్న హుజూరాబాద్ రాజకీయం

FIR filed against Etela Rajender: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపి నుంచి ఈటల రాజేందర్ (Eetela Rajender) పోటీ చేస్తుండగా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav), కాంగ్రెస్ పార్టీ తరపున నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం నాయకుడు బల్మూరి వెంకట్ (Balmoori Venkat) బరిలోకి దిగుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2021, 11:35 AM IST
  • బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్‌పై కేసు నమోదు.
  • ఈటల రాజేందర్‌పై ఫిర్యాదు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు.
  • ఉప ఎన్నిక తేదీ సమీపిస్తుండటంతో వేడెక్కుతున్న హుజూరాబాద్ రాజకీయం
Huzurabad bypolls: ఈటల రాజేందర్‌పై కేసు నమోదు.. వేడెక్కుతున్న హుజూరాబాద్ రాజకీయం

FIR filed against Etela Rajender: హుజూరాబాద్ ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో హుజూరాబాద్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో సెంటారాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన బీజేపీ నేత, ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

కరోనావైరస్ (Coronavirus in Telangana) వ్యాప్తి నివారణ కోసం కేంద్రం విధించిన కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి ఈటల రాజేందర్ ఎన్నికల సభ నిర్వహించారంటూ హుజూరాబాద్ ఉప ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది కూడా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందంటూ ఫ్లయింగ్ స్క్వాడ్ తమ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసు నమోదు చేశారు.

Also read : Telangana COVID-19 cases: తెలంగాణలో లేటెస్ట్ కరోనావైరస్ అప్‌డేట్స్

హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపి నుంచి ఈటల రాజేందర్ (Eetela Rajender) పోటీ చేస్తుండగా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav), కాంగ్రెస్ పార్టీ తరపున నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం నాయకుడు బల్మూరి వెంకట్ (Balmoori Venkat) బరిలోకి దిగుతున్నారు.

Also read : Tenth class papers in Telangana : టెన్త్ పరీక్షల్లో 'ఆరు' పేపర్లే...కేసీఆర్ సర్కారు కీలక ఉత్తర్వులు

Also read : Petrol prices, diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. Fuel rates today

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News