Manchu Vishnu Did not Reacts Manoj Mounika Marriage మంచు మనోజ్ భూమా మౌనికల పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ఫిల్మ్ నగర్‌లోని నివాసంలోనే ఈ పెళ్లి జరిగింది. అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. అయితే ఈ వేడుకల్లో మంచు విష్ణు ఎక్కడా కనిపించలేదు. అలా వచ్చి ఇలా వెళ్లినట్టుగా తెలుస్తోంది. మంచు విష్ణు గానీ, విరానిక గానీ, వారి పిల్లల సందడి గానీ ఎక్కడా కనిపించలేదు. తమ్ముడి పెళ్లిలో అన్నావదినల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లిలో మంచు విష్ణు, విరానికలు కనిపించలేదు. అరియానా, వివియానాల సందడి కనిపించలేదు. అవ్రామ్ కూడా లేడు. అలా మంచు విష్ణు ఫ్యామిలీ మాత్రం పెళ్లిలో ఎక్కువగా సందడి కనిపించలేదు. అయితే మంచు లక్ష్మీ మాత్రం ఈ పెళ్లిని తన భుజాల మీద నడిపించినట్టుగా కనిపిస్తోంది.


అక్కాతమ్ముళ్ల బంధం కూడా అందరికీ అర్థమైంది. ఏ జన్మ పుణ్యమో అంటూ తన అక్క మీద ప్రేమను కురిపించాడు మంచు మనోజ్. మంచు లక్ష్మీ అయితే తన తమ్ముడి పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ సంబరాల్లో తేలిపోయింది. కానీ మంచు విష్ణు మాత్రం ఎక్కడా కూడా ఫోటోలను షేర్ చేయడం లేదు, పెళ్లీ మీద రియాక్ట్ అవ్వడం లేదు. చూస్తుంటే మంచు విష్ణుకి ఈ పెళ్లి అంతగా ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది.


ఇందులో ఏమైనా రాజకీయాలు కూడా ఉన్నాయా? లేదా నార్మల్‌గానే స్పందించడం లేదా? అన్నది తెలియడం లేదు. మామూలుగా అయితే మంచు విష్ణు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాడు. చిన్న చిన్న విషయాల మీదే సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతుంటాడు. అలాంటిది తమ్ముడి పెళ్లి గురించి ట్వీట్ గానీ పోస్ట్ గానీ ఫోటో గానీ షేర్ చేయకపోవడం ఏంటి? అని జనాలు అనుకుంటున్నారు.


మొత్తానికి మంచు వారి మధ్య ఏదో గ్యాప్ వచ్చినట్టుగా ఇన్నేళ్లు వస్తోన్న రూమర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. మంచు వారంతా వేర్వేరు ఇళ్లలో ఉంటారన్న విషయం తెలిసిందే. ఇలా ఈ పెళ్లితో వారి మధ్య ఉన్న విబేధాలు బయటకు వచ్చాయని నెటిజన్లు అనుకుంటున్నారు.


Also Read:  Manchu Manoj Marraige : ఏ జన్మ పుణ్యమో నాది.. మంచు మనోజ్ ఎమోషనల్


Also Read: Shruti Hassan Knee Injury : శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం.. నెటిజన్ల సెటైర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook