Manchu Manoj Marraige : ఏ జన్మ పుణ్యమో నాది.. మంచు మనోజ్ ఎమోషనల్

Manchu Manoj Bhuma Mounika Marriage మంచు మనోజ్ భూమా మౌనికలకు నేడు వివాహాం జరగబోతోంది. ఈ పెళ్లిలో టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా సందడి చేసేలా కనిపిస్తున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగబోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2023, 06:47 PM IST
  • నేడు మంచు మనోజ్ రెండో పెళ్లి
  • భూామా మౌనికతో ఘనంగా మనోజ్ వివాహాం
  • తమ్ముడి పెళ్లిలో మెరిసిపోతోన్న మంచు లక్ష్మీ
Manchu Manoj Marraige : ఏ జన్మ పుణ్యమో నాది.. మంచు మనోజ్ ఎమోషనల్

Manchu lakshmi on Manchu Manoj Bhuma Mounika Wedding మంచు వారింట్లో ఇప్పుడు సంబరాలు అంబరాన్నంట్టుతున్నాయి. మంచు మనోజ్ భూమా మౌనికల వివాహాం నేడు జరుగుతోంది. రాత్రి 8.30 నిమిషాలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఫిల్మ్ నగర్‌లోని నివాసంలోనే ఈ పెళ్లి జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ఇంత వరకు మంచు మనోజ్ ఈ పెళ్లి గురించి అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ నేటి మధ్యాహ్నం మాత్రం మౌనిక రెడ్డి ఫోటోను షేర్ చేస్తూ.. పెళ్లి కూతురు అని ట్వీట్ వేశాడు. అంతే కాకుండా మనోజ్ వెడ్స్ మౌనిక అని హ్యాష్ ట్యాగ్ పెట్టేశాడు. దాంతో మంచు మనోజ్ మొదటి సారిగా పెళ్లి గురించి చెప్పినట్టు అయింది.

ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యుల మాత్రమే హాజరైనట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలోని అతి ముఖ్యమైన సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. తాజాగా మంచు లక్ష్మీ తన తమ్ముడి ఫోటోను షేర్ చేసింది. పెళ్లి కొడుకు అంటూ చెప్పుకొచ్చింది. చూస్తుంటే అది హల్దీ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలా కనిపిస్తోంది.

ఇక తన అక్క చూపించిన ప్రేమకు మంచు మనోజ్ ముగ్దుడైపోయాడు. థాంక్యూ అక్కా.. ఏ జన్మ పుణ్యమో నాది.. నువ్ నాకోసం చేసిన ప్రతీ దానికి థాంక్స్ అక్కా అని ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి మంచు మనోజ్ మాత్రం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోన్నాడు. ఈ రెండో పెళ్లితో మంచు మనోజ్ జీవితంలోకి కొత్త వెలుగులు రానున్నాయి.

ఇప్పుడు మంచు మనోజ్ పర్సనల్ లైఫ్ మాత్రమే కాకుండా సినీ జీవితం కూడా ట్రాక్ ఎక్కేలా కనిపిస్తోంది. అహం బ్రహ్మాస్మి ఆగిపోయినా కూడా వాట్ ది ఫిష్ అనే సినిమాతో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మధ్యే విడుదల చేసిన పోస్టర్లు, టైటిల్ అన్నీ కూడా జనాలను ఆకట్టుకున్నాయి.

Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా

Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News