Movie Artists Association: అల్లు అర్జున్ వివాదం తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై తొలిసారి మంచు విష్ణు స్పందించాడు. ఈ సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులకు ఒక విధమైన హెచ్చరిక చేశారు. అల్లు అర్జున్ - రేవంత్ రెడ్డి అంశంలో ఎవరూ నోరు మెదపవద్దని సూచించారు. ఇది సున్నితమైన అంశమని.. ఎవరూ స్పందించకూడదని తెలిపారు. వ్యక్తిగత అభిప్రాయం కూడా మా సభ్యులు వెలిబుచ్చరాదని పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఓ ప్రకటన విడుదల చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Jr NTR Fan: జూనియర్‌ ఎన్టీఆర్‌పై విమర్శలపై యూటర్న్‌.. కౌశిక్‌ తల్లి వివరణ ఇదే!


ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందని మా అధ్యక్షుడు మంచు విష్ణు గుర్తు చేశాడు. 'హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి.. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉంది' అని వివరించాడు. ప్రతీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తోందని స్పష్టం చేశాడు. 'ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 'మా' సభ్యులకు వినతి. సున్నితమైన విషయాలపై 'మా' సభ్యులు స్పందించొద్దు' అని సూచించాడు.

Also Read: Dil Raju: సంధ్య థియేటర్‌ బాధిత రేవతి భర్తకు దిల్‌ రాజు బంపర్‌ ఆఫర్‌.. సినిమా ఛాన్స్‌


'సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిది' అని మంచు విష్ణు పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేస్తుందని తెలిపాడు. 'అలాంటి అంశాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉంది' అని మంచు విష్ణు తెలిపాడు. 'మా' సభ్యులకు ఐక్యత అవసరమని మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రకటించాడు.

విష్ణు చేసిన ప్రకటన వెనుక అల్లు అర్జున్ వ్యవహారంతో పాటు తమ కుటుంబంలో ఏర్పడిన ఆస్తుల గొడవ కూడా ఉందని తెలుస్తోంది. దీనికితోడు సినీ పరిశ్రమలో వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ వ్యవహారాల్లో తమ జోక్యం ఉండకూడదని.. తెలంగాణ ప్రభుత్వంతో ఘర్షన పాత్ర ఎందుకనే ధోరణిలో మా సంఘం ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఇంత పెద్ద వివాదంలో మా సంఘం ప్రేక్షకపాత్ర వహించడం విమర్శలకు తావిస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.