Manchu Vishnu 100 Crores project: అటు మంచు మోహన్ బాబు పరిస్థితి గానీ ఆయన కుమారుల పరిస్థితి కానీ ఏమాత్రం బాగాలేదు. మోహన్ బాబు చివరిగా నటించిన సన్నాఫ్ ఇండియా దారుణమైన డిజాస్టర్ గా నిలవడమే కాదు తెలుగు సినిమా చరిత్రలోనే దారుణ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది, ఇక ఆ తర్వాత మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా కూడా కథ పరంగా పరవాలేదు అనిపించుకున్నా కలెక్షన్ల పరంగా మాత్రం డిజాస్టర్ గానే నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి వీరి కాంబినేషన్ గురించి వీళ్ళు ఒక ఆసక్తికరమైన ప్రకటన చేయడం హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా మోహన్ బాబు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మాట్లాడుతున్న సమయంలో తాము ఒక 100 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేస్తున్నామంటూ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. నిజానికి మంచు విష్ణు హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందని 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా ఉంటుందని ప్రకటించారు.


Also Read: Shruti Reddy Photos: పొట్టి గౌనులో కాక రేపేస్తున్న శృతి రెడ్డి.. వామ్మో?


అయితే ఈ సినిమా మోహన్ బాబు యూనివర్సిటీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. పేరుకు 100 కోట్ల రూపాయలు బడ్జెట్ అని చెబుతున్నా సరే అంతగా సినిమాకి ఖర్చు పెట్టే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీ బ్యాక్ డ్రాప్ సినిమా కథ, అంటే షూటింగ్ అంతా అక్కడే చేస్తారు. లొకేషన్ ఖర్చు కూడా ఉండదు కేవలం నటినటులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్లు మాత్రమే ఉంటాయి.


హీరో ఎలాగో మంచు విష్ణు కాబట్టి ఆయనకు కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సొంత సినిమా కాబట్టి ఇక దర్శకుడు ఇతర టెక్నీషియన్లకు తమ మాట విని తమ బడ్జెట్లో వచ్చే వారిని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది లేదు. అయితే సోషల్ మెసేజ్ తో 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా అంటే నమ్మి థియేటర్ల వరకు వెళ్లి చూసేవాళ్ళు ఎందరు ఉన్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడాలి మంచు కుటుంబం మళ్లీ ట్రాక్ లో పడుతుందో లేదు అనేది. 


Also Read: Prabhas Project k : ప్రాజెక్ట్ కేతో బాహుబలి రికార్డులు అవుట్.. రానా కామెంట్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK