Market Mahalakshmi:గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రియేటివిటీ పెరిగిపోయింది. డిఫరెంట్ కాన్సెస్ట్ మూవీస్ వస్తున్నాయి. ఈ కోవలో తెరకెక్కిన చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. ఈ మూవీలో కేరింత మూవీ పార్వతీశం హీరోగా నటిస్తున్నాడు. టైటిల్ రోల్ 'మార్కెట్ మహాలక్ష్మి' పాత్రలో ప్రణీకాన్విక కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. వి.యస్. ముఖేష్ యంగ్ టాలెంటెడ్ డైరెక్షన్‌లో ప్రొడ్యూసర్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించారు. ఈ మూవీ 'కాన్సెప్ట్ మోషన్ పోస్టర్' ని డైరెక్టర్ & రైటర్ 'బివిఎస్ రవి' ట్విట్టర్ ద్వారా లాంచ్ చేసారు.
గతంలో హీరో పార్వతీశం తన మూవీస్ తో ప్రేక్షకులని అలరించాడు.  'మార్కెట్ మహాలక్ష్మి'తో మంచి సక్సెస్ అందుకోవాలని టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.  


డైరెక్టర్ 'వియస్ ముఖేష్' మాట్లాడుతూ: తెలుగు సినీ ఇండస్ట్రీ కి కొత్త వాళ్ళు ఎవ్వరు వచ్చిన మొదటగా వెల్కమ్ చెప్పి ప్రోత్సహించే వ్యక్తుల్లో 'బివిఎస్ రవి' ఒకరు. మా సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయమని అడగగానే, ఓకే చెప్పి మా టీమ్ ని ఆశీర్వదించినందకు ధన్యవాదాలు తెలిపారు.  


నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.


టెక్నికల్ టీమ్:
రచన & దర్శకత్వం: వియస్ ముఖేష్
ప్రొడ్యూసర్: అఖిలేష్ కలారు
ప్రొడక్షన్ హౌస్: బి2పి స్టూడియోస్
సంగీతం: మిష్టర్ జో
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
ఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి
పాటలు: వియస్ ముఖేష్, మిష్టర్ జో
బ్యాగ్రౌండ్ స్కోర్: సృజన శశాంక
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లోకేష్. పి
కొరియోగ్రఫీ: రాకీ
ఆర్ట్ డైరెక్టర్: సంజన కంచల
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రియాంక పాండ
పోస్టర్ డిజైనర్: రానా
పీఆర్వో: తిరుమలశెట్టి వెంకటేష్


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter